మహేశ్ బాబు షూటింగ్ స్పాట్ కు మెగాస్టార్ సంతోషాన్ని ట్విట్టర్ లో పంచుకున్న దర్శకుడు మురుగదాస్ మరి సూపర్ స్టార్ షూటింగ్ స్పాట్ కు పనిగట్టుకుని మెగాస్టార్ ఎందుకెళ్లాడో
ఫిల్మ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ తలపడే హీరోలు ఆఫ్ స్క్రీన్ మాత్రం ఆసక్తికరంగా వ్యవహరిస్తుంటారు. ఇండస్ట్రీలో యంగ్ హీరోల సినిమా స్పాట్ కు ప్రముఖ హీరోలు హాజరైతే ఆ సందడి అంతా ఇంత ఉండదు. తాజాగా ప్రిన్స్ 'మహేష్ బాబు' - ‘మురుగదాస్' కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సామాజిక కోణంలో సినిమా తీసే మురుగదాస్ ఈ చిత్రంలో ఓ సామాజిక అంశాన్ని స్పృశించారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సెట్స్ ను మెగాస్టార్ 'చిరంజీవి' సందర్శించారు. ఈ ఫొటోలో 'మహేష్ బాబు', ’చిరంజీవి', ’మురుగదాస్' లున్నారు. తమ షూటింగ్ స్పాట్ కు మెగాస్టార్ రావడంపట్ల దర్శకుడు మురుగదాస్, సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ.. విడుదల కాలేదు. కనీసం సెట్స్ మీద నుంచి కూడా ఎలాంటి స్టిల్స్ నూ విడుదల చేయలేదు. కానీ మెగాస్టార్ 'చిరంజీవి' మహేష్-మురుగదాస్ ల మూవీ షూటింగ్ స్పాట్ కు వెళ్లినప్పుడు తీసిన ఫోటో మాత్రం సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటిస్తున్న తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ప్రముఖ డైరెక్టర్ 'ఏ.ఆర్.మురుగదాస్' తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సామాజిక అంశాలను మేళవించి సినిమాలను రూపొందిస్తున్న 'మురుగ దాస్'... ఈ సినిమాలో కూడా ఓ సామాజిక కోణాన్ని సృశించినట్లు తెలుస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది.
చిత్ర షూటింగ్ మాత్రం షరవేగంగా జరుగుతున్నా చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్ ఇంకా విడుదల కాలేదు. ఆఖరికి సినిమాకు పేరు కూడా పెట్టలేదు. దీనితో సినిమాపై ఇంకా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. తాజాగా మురుగదాస్ చిత్ర రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు. తమ సినిమాను జూన్ 23న రిలీజ్ చేయనున్నట్టు మురుగదాస్ ఓ ట్వీట్ చేశాడు. జూన్ 23న థియేటర్లలో తమ ఆతిథ్యం స్వీకరించాలని, ఆ రోజు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్టు అందులో పేర్కొన్నాడు.
ఇక డైరెక్టర్ మురుగదాస్ ఈ సినిమా టీజర్ కి భారీగానే ఖర్చు పెట్టిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ లండన్లో రెడీ అవుతుండటం విశేషం. అక్కడ ఓ ప్రత్యేక బృందం టీజర్ తీర్చిదిద్దుతోందట. నిడివి తక్కువే అయినా ఇంపాక్ట్ గట్టిగా ఉండేలా ఈ టీజర్‌ను మలిచే ప్రయత్నంలో ఉన్నారట. కచ్చితంగా ఈ టీజర్ తెలుగు.. తమిళ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా ఉంటుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
ఇదంతా ఇలా ఉంటే... ఇటు మెగా స్టార్ చిరంజీవి, మహేష్ బాబు సినిమా షూటింగ్ కు ఎందుకు వెళ్లాడోనని అభిమానుల్లో గుసగుసలు మొదలయ్యాయి.
