Megastar Record: చిరంజీవి వరల్డ్ రికార్డ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్.. డిటెయిల్స్
మెగాస్టార్ చిరంజీవి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఏ సూపర్ స్టార్‌కి కూడా సాధ్యం కాని విధంగా ఆయన ఏకంగా నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. అంతేకాదు దీనికి సంబంధించి ఆసక్తికర విషయాలు ఇలా ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) అరుదైన రికార్డుని సొంతం చేసుకోబోతున్నారు. ప్రపంచంలో ఏ సూపర్‌స్టార్ చేయనటువంటి రేర్ ఫీట్ ని చిరు చేయబోతున్నారు. ఏకంగా నాలుగు సినిమాల్లో ఏ కాలంలో నటించనున్నారు. అయితే ఒకే నెలలో ఆయన నాలుగు సినిమాల షూటింగుల్లో పాల్గొనబోతుండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. టాలీవుడ్‌ని సైతం సర్ప్రైజ్ చేయబోతుంది.
ప్రస్తుతం Chiranjeevi ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నారు. `ఖైదీ నెంబర్ 150` చిత్రంతో ఆయన రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొమ్మిదేండ్ల గ్యాప్ తర్వాత కూడా తన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. ఈ సినిమా సుమారు 150 కోట్లు కలెక్ట్ చేసిందని టాక్. `సైరా` తర్వాత చిరంజీవి తన సినిమా జోరు పెంచారు. వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతూ దూసుకుపోతున్నారు.
అందులో భాగంగా ఇప్పుడు ఆయన నాలుగు సినిమాలు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య`(Acharya) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆల్మోస్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. రామ్‌చరణ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్యాచ్‌వర్క్ ఈ డిసెంబర్‌లో పూర్తి చేయబోతున్నారట. మరోవైపు `లూసీఫర్` రీమేక్ `గాడ్‌ఫాదర్`(God Ffather) సినిమా చేస్తున్నారు చిరు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నయనతార కథానాయికగా ఎంపికైంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
మరోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళాశంకర్` చిత్రం చేస్తున్నారు చిరంజీవి. ఇది తమిళ చిత్రం `వేదాళం`కి రీమేక్. ఇందులో తమన్నా కథానాయికగా, కీర్తిసురేష్ చెల్లి పాత్రని పోషిస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించుకుంది. మరోవైపు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఇది `మెగా154` పేరుతో రూపొందుతుంది. ఈ సినిమా కూడా గత నెలలోనే ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ ఈ డిసెంబర్ నెలలో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. దీంతో చిరంజీవి ఏకకాలంలో ఈ నాలుగు సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొంటుండటం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటే, ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది.
అయితే ఓ పెద్ద సూపర్ స్టార్ ఇలా ఏక కాలంలో ఒకే నెలలో నాలుగు సినిమాల్లో నటించడం రికార్డు అని చెబుతున్నారు. ఇది ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డ్ గా చెబుతున్నారు. దీంతో ఇప్పుడు మెగాస్టార్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఈ వయసులో ఏకంగా నాలుగు సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్‌మీదుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇందులో దాదాపు మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కాబోతుండటం మరోవిశేషం. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
also read: Chiranjeevi: మీడియా నన్ను బద్నామ్ చేసింది... ఆ మూడు ఛానల్స్ కి చిరంజీవి చురకలు