ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి (Chiranjeevi)మీడియాకు సున్నితంగా చురకలు అంటించారు. అప్పట్లో మీడియా నేను ఫ్యాన్స్ ని అంటరాని వాళ్ళగా చూసినట్లు చిత్రీకరించి ప్రచారం చేసిందని సెటైర్లు వేశారు.
2008లో ప్రజారాజ్యం పార్టీ (Praja Rajyam Party) స్థాపించిన చిరంజీవి 2009 ఎన్నికలకు ముందు ప్రజా అంకిత యాత్ర చేశారు. బస్సులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయన తిరిగారు. ఈ సమయంలో ఫ్యాన్స్ తో పాటు ప్రజలను ఆయన కలవడం జరిగింది. ఈ ప్రజా అంకిత యాత్ర సమయంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్న చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి మీడియా తనపై చేసిన దుష్ప్రచారాన్ని గుర్తు చేసుకున్నారు.
యాత్రలో నేను ప్రజలతో మమేకమయ్యాను. చాలా మందిని ఆలింగనం చేసుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం చేశాను. ఒక స్టేషన్ లో స్పీచ్ ముగిశాక నెక్స్ట్ స్టేషన్ కి బస్సులో వెళుతున్నాను. నాలుగు మీడియా ఛానల్స్ నన్ను నిరంతరం ఫాలో అవుతున్నాయి. అది నా మీద ప్రేమతో కాదు... ఎక్కడ చిన్న పొరపాటు జరుగుతుందా.. హైలెట్ చేయాలనే తపనతో.
బస్ లో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న నాకు మా బాయ్ ఖర్జూరాలు తినడానికి ఇచ్చాడు. వాటిని తినడం కోసం శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకున్నాను. అది నీట్ గా వీడియో తీసి.. నేను పండ్లు తినడం కోసం చేతులు శుభ్రం చేసుకున్న వీడియో పక్కన పెట్టి... ఫ్యాన్స్ కి షేక్ హ్యాండ్ ఇవ్వగానే చేతులు శానిటైజర్ తో శుభ్రం చేసుకున్నట్లు చక్కగా ఎడిట్ చేశారు.
Also read బాలయ్య కంటే ముందే అఘోరాగా చేసిన చిరు, నాగ్, వెంకీ.. మరి ఆ చిత్రాలు హిట్టా ఫట్టా?
చేతులు శుభ్రం చేసుకుంటున్న వీడియో పదే పదే చూపిస్తూ.. చిరంజీవికి ఫ్యాన్స్ అంటే అంత అంటరాన్ని వాళ్ళు అయ్యారా? ప్రజల్ని తాకడమంటే ఆయనకు అంత అసహ్యమా? ఇలాంటి వ్యాఖ్యలతో నన్ను బద్నామ్ చేశారు. అందుకే ఇప్పుడు మైక్ పైన శానిటైజర్ స్ప్రే చేద్దామన్నా... భయం వేస్తుంది. మీడియా దీన్ని ఎలా ప్రచారం చేస్తుందో చెప్పలేం... అంటూ చిరంజీవి రాజకీయ ప్రస్థానంలో ఎదురైన చేదు అనుభవం గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Also read ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ కన్ఫర్మ్ చేసిన మహేష్!
