పవన్ కి చిరంజీవి విసిరిన ఛాలెంజ్!

chiranjeevi accepted green challenge and thrown to pawan kalyan
Highlights

నాకు వచ్చిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మా ఇంటి పెరట్లో మూడు మొక్కలను నాటాను. ఈ సందర్భంగా నేను మరో ముగ్గురు ప్రముఖులను ఎంచుకొని వాళ్లను నామినేట్ చేస్తున్నాను.ఆ ప్రముఖులు మరెవరో కాదు.. అమితాబ్ బచ్చన్ జీ, పెద్దలు రామోజీరావు, నా తమ్ముడు పవన్ కళ్యాణ్

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన అన్నయ్య చిరంజీవి ఓ ఛాలెంజ్ విసిరాడు. ఇదేదో సినిమాలకు, రాజకీయాలను సంబంధించిన ఛాలెంజ్ కాదండి.. గ్రీన్ ఛాలెంజ్. ఇప్పుడు ఈ గ్రీన్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు ఈ ఛాలెంజ్ లో పాల్గొంటూ ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు.

కేటీఆర్, కవిత, సచిన్, రాజమౌళి, మహేష్ బాబు లాంటి ప్రముఖులు ఇప్పటికే ఈ ఛాలెంజ్ ను స్వీకరించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందులో పాల్గొని మరికొందరు ప్రముఖులకు ఛాలెంజ్ విసిరారు. ప్రముఖ ఛానెల్ అధినేత నరేంద్ర చౌదరి విసిరిన సవాల్ ను సీకరించిన చిరు తన ఇంట్లో మూడు మొక్కలను నాటి.. అమితాబ్ బచ్చన్, రామోజీరావు, పవన్ కళ్యాణ్ లను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

''నాకు వచ్చిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మా ఇంటి పెరట్లో మూడు మొక్కలను నాటాను. ఈ సందర్భంగా నేను మరో ముగ్గురు ప్రముఖులను ఎంచుకొని వాళ్లను నామినేట్ చేస్తున్నాను.ఆ ప్రముఖులు మరెవరో కాదు.. అమితాబ్ బచ్చన్ జీ, పెద్దలు రామోజీరావు, నా తమ్ముడు పవన్ కళ్యాణ్. వీళ్లు ముగ్గురు ఈ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేసి ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతారని ఆశాభావంతో ఉన్నాను. అమితాబ్ బచ్చన్ జీ ను నామినేట్ చేస్తున్నాను. సార్ ప్లీజ్ గ్రీన్ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేయండి. ఇండియా మిమ్మల్ని ఫాలో అవుతుంది' అని వెల్లడించారు.  
 

loader