సుశాంత్, రుహానీ శర్మ జంటగా నటిస్తోన్న చిత్రం 'చిలసౌ'. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి రూపొందించిన ఈ సినిమా ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.

చాలా సింపుల్ గా హీరోయిన్ మీద చిత్రీకరించిన ఈ టీజర్ చివర్లో.. ప్రతి ఒక్కడికి కత్రినా కైఫ్ కావాలి.. కానీ ఎవడు రన్ బీర్ లా ఉండడు.. అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అవుట్ పుట్ చూసిన నాగార్జున స్వయంగా తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ  సినిమాను  విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇదివరకు విడుదలైన టీజర్ తో సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన చిత్రబృందం ఈసారి హీరోయిన్ క్యారెక్టర్ ను రివీల్ చేసింది. మరి ఆడియన్స్ ను ఈ సినిమా ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి!