ఆషిఖి2తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధ కపూర్ తాజాగా సాహోలో ప్రభాస్ సరసన నటిస్తున్న శ్రద్ధ శ్రద్ధపై చీటింగ్ కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు
సీనియర్ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ వారసురాలిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శ్రద్దా కపూర్. మొదటి చిత్రం ఆషికీ 2 చిత్రంతో అందరి హృదయాలను కొల్లగొట్టిన ఈ చిన్నది.. ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేక పోయాయి. ఓ వైపు మోడలింగ్ మరో వైపు సినిమాల్లో నటిస్తున్న శ్రద్దాకపూర్ పై తాజాగా చీటింగ్, క్రిమినల్ కేసు నమోదు అయ్యింది.
ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రదారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా జీవిత నేపథ్యంలో హసీనా పార్కర్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అయిన హసీనా పాత్రలో శ్రద్ధాకపూర్ నటించింది. ఇందులో హీరోయిన్ డ్రెస్సులను ఏజేటీఎం సంస్థ సమకూర్చింది.
ఒప్పందంలో భాగంగా ప్రమోషన్లలో తమ బ్రాండ్ దుస్తులే ధరించాలని హీరోయిన్ శ్రద్ధా, ప్రొడ్యూసర్లతో ఆ సంస్థ డీల్ కుదుర్చుకుంది. కానీ, ఒప్పందంలో రాసుకున్నట్లుగా శ్రద్ధా కపూర్ గానీ, సినిమా బృందం గానీ ప్రచార కార్యక్రమాల్లో తమ బ్రాండ్ `ఏజేటీఎమ్ (ఏజే మిస్త్రీ అండ్ థియా మిన్హాస్)`కు ప్రచారం కల్పించడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అందుకే క్రిమినల్ కేసు పెట్టామని ఆయన చెప్పారు. అక్టోబర్ 26న ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగనుంది. మరోపక్క ఈ కేసు విషయంపై శ్రద్ధా కపూర్ నుంచి గానీ, నిర్మాతల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. ఇలాంటి సందర్భాల్లో సెలెబ్రిటీలది తప్పని తేలితే న్యాయమూర్తులు భారీ జరిమానా విధించిన కేసులు చూస్తునే వున్నాం.
శ్రద్ధ ఇప్పుడు తెలుగులో ప్రభాస్ సరసన భారీ బడ్జెట్ చిత్రం సాహోలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
