యంగ్ హీరోయిన్ హ‌న్సిక‌ వివాదంలో చిక్కుకుంది. హన్సికపై ఆమె మేనేజ‌ర్ చీటింగ్ ఆరోపణలు చేశాడు. చాలా రోజుల నుంచి హన్సిక దగ్గర మేనేజ‌ర్‌గా పని చేస్తున్నానని, త‌న‌కి హ‌న్సిక ఇంతవరకూ మ‌నీ సెటిల్‌మెంట్ చేయడం లేదనీ మునుస్వామి అనే వ్యక్తి న‌డిగ‌ర్ సంఘంలో ఫిర్యాదు చేశాడు. అయితే.. హ‌న్సిక డేట్స్‌, ఆమె రెమ్యున‌రేష‌న్ విష‌యాల‌ను సాధారణంగా ఆమె త‌ల్లే చూసుకుంటారు. ఈ నేపథ్యంలో మునుస్వామి చెబుతున్న మాట‌లు ఎంతవరకు నిజమనేది తేలాల్సి ఉంది.

అన్ని ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నానని మునుస్వామి పేర్కొంటున్నాడు. ఈ అంశంపై హ‌న్సిక ఇప్పటివ‌ర‌కూ స్పందించలేదు. తమ అభిమాని నటిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు.

హన్సిక ప్రస్తుతం.. ‘తుపాకి మున్నై’ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. విక్రమ్ ప్రభు హీరోగా ఈ చిత్రం తెర‌కెక్కుతుతోంది. దీంతో పాటు సామ్ ఆంట‌న్ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమాలోనూ నటిస్తోంది.