ముంబైలో పుట్టి పెరిగిన పంజాబీ బ్యూటీ చార్మి కౌర్.... సినిమాను తనకెరీర్‌గా ఎంచుకుని, తెలుగులో వరుస అవకాశాలు రావడంతో అవిచేస్తూ టాలీవుడ్లో సెటిలయ్యారు. స్టార్ హీరోయిన్ రేంజిక కాక పోయినా తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా సక్సెస్‌లు తగ్గడంతో ఫిల్మ్ ప్రొడక్షన్ వైపు రూటు మార్చిన ఆమె పూరితో కలిసి పలు చిత్రాలు నిర్మిస్తూ తెర వెనక తన కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన సినిమా కెరీర్, పర్సనల్ లైఫ్, ప్రేమ, పెళ్లి అంశాలకు సంబంధించి పలు ఆస్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు? ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.... ఇండస్ట్రికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడ్డమాట నిజమే. రెండు విషయాల వల్ల ఆ ప్రేమ విఫలమైంది. ఒక వేళ మాకు పెళ్లి జరిగి ఉంటే ఆ రెండు కారణాల వల్ల ఇప్పటికే విడాకులు కూడా తీసుకుని ఉండేవారం అని చార్మి చెప్పుకొచ్చారు.పెళ్లి చేసుకుంటే ఆ రిలేషన్ షిప్‌కు నేను న్యాయం చేయలేను, అతడికి సమయం కేటాయించలేను అని తెలిపారు.పెళ్లి చేసుకోవాలని అమ్మ ఎప్పుడూ నాపై ఒత్తిడి తెస్తూనే ఉంటుంది. కానీ పెళ్లిపై నాకు నమ్మకం లేదు. జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. బ్రతికినంతకాలం ఇలానే మా తల్లిదండ్రులతో ఉండిపోవాలని డిసైడ్ అయ్యాను అని చార్మి తెలిపారు.