ఆ హీరోయిన్ కోట్లు పోగొట్టుకుందట!

charmi lost hero life savings on mehbooba movie
Highlights

దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరి హీరోగా 'మెహబూబా' సినిమాను

దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరి హీరోగా 'మెహబూబా' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఆకాష్ ను హీరోగా సెటిల్ చేయడానికి పూరి ఎంతో శ్రమించి ఈ సినిమాను రూపొందించాడు. కానీ రిజల్ట్ దెబ్బ కొట్టింది. అటు విమర్శకుల నుండి ఇటు ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు సరైన ఆదరణ లభించలేదు. దీంతో కమర్షియల్ గా ఈ సినిమా వర్కవుట్ కాలేదు. 

ఈ కారణంగా హీరోయిన్ ఛార్మి కోట్లు పోగొట్టుకుందని చెబుతున్నారు. పూరి జగన్నాథ్ నిర్మాణ సంస్థ పూరి క్రియేటివ్ వర్క్స్ లో ఛార్మి కూడా ఓ భాగం. పూరి తెరకెక్కించే ప్రతి సినిమాకు ఛార్మి కూడా తనవంతు సహకార బాధ్యతలు నిర్వర్తిస్తోంది. 'మెహబూబా' సినిమా నిర్మాణ బాధ్యతల్లో తను కూడా పాలుపంచుకుంది. ఇప్పుడు సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ కావడంతో ఛార్మి కూడా ఊహించని విధంగా నష్టాలపాలయ్యిందని చెబుతున్నారు.

ఆమె వాటాగా కనీసం ఐదారు కోట్లు పోగొట్టుకుందని టాక్. హీరోయిన్ గా సంపాదించుకున్న డబ్బు కాస్త నిర్మాణంలో పోగొట్టుకుందని ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

loader