చార్మి మరు జన్మ ఎత్తినట్లు ఫీలవుతోందా.. డ్రగ్స్ కేసు విచారణ తర్వాత రిలాక్స్ అయిన చార్మి తుఫాను నుంచి బైటపడి మరుజన్మ ఎత్తినట్లుందని ట్వీట్

టాలీవుడ్ లింక్స్ బైటపడటంతో డ్రగ్స్ వ్యవహారంలో నోటీసులు ఎదుర్కొన్న టాలీవుడ్ సెలెబ్రిటీల్లో చార్మి ఒకరు. టాలీవుడ్ సెలెబ్రిటీలు మాత్రమేకాక ఆర్థికంగా బలిసిన కుటుంబాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ఎందరో ఈ డ్రగ్స్ అలవాట్ల మధ్య చిక్కుకున్నారు అని తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉంది అంటూ సిట్ అధికారులు లీక్స్ ఇస్తున్నారు. అయితే అవేమి పట్టించుకోకుండా మన ప్రభుత్వాలు మాత్రం డ్రగ్స్ వాడే వారు అంతా భాదితులు వాడకం దార్లు అంటూ తెల్చివేసిన విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలో జరుగుతున్న పరిణామాలను చూసి ఛార్మీ ఒక ట్విట్ రూపంలో తన ఫీలింగ్స్ అందరికీ షేర్ చేసింది. ‘‘ఒక తుపాన్ నుంచి బైటపడ్డావంటే.. నువ్వొక కొత్త జన్మ ఎత్తినట్లే. నీలో వున్న ఆ కొత్త శక్తిని నీకు తెలియజెప్పడమే ఆ తుపాను ఉద్దేశం'' అంటూ ఓ జపనీస్ రచయిత 'కోట్' ని పోస్ట్ చేసింది ఛార్మి. ఇక్కడ తుపాన్ అంటే ఛార్మీ చిక్కుకున్న డ్రగ్ వ్యవహారానికి సంబంధించిన నోటీసులనుకోవాలి. టాలీవుడ్‌ని కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారంలో ఛార్మి ఉందంటూ మీడియా వర్గాలు ఎంతో రచ్చ చేసినా ఆమె బెదిరి పోకుండా కోర్ట్ మెట్లు ఎక్కి మరీ పోరాటం చేసిన విషయం తెలిసిందే. 

చార్మి పోరాటానికి ముగ్దుడైన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముచ్చటపడి ఆమెను ఝాన్సీలక్షి బాయితో పోల్చాడు. ఈ పోల్చడం పై కూడా అనేక విమర్శలు కూడ వచ్చాయి. అయితే ఛార్మీ లేటెస్ట్ గా చేసిన ఈ ట్విట్ ను చూసిన వారు మాత్రం టాలీవుడ్ సెలెబ్రెటీలు అంతా ఈ డ్రగ్స్ గండం నుండి బయటపడినట్లే అనుకోవాలి.

డ్రగ్స్ మద్యం సిగరెట్ అమ్మకాలను నియంత్రిచగలం కానీ వాటి దుకాణాలను మూసివేసే అధికారం తమకు లేదంటూ సిట్ కు చెందిన ఒక ప్రముఖ అధికారి ఒక ప్రముఖ సమావేశంలో కమెంట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనినిబట్టి చూస్తుంటే చరిత్రలో కలిసిపోయే మరో సంచలన కేసుగా డ్రగ్స్ కేసు కాలగర్బంలో కలిసిపోతోందన్న కమెంట్స్ లో నిజం లేకపోలేదని వినిపిస్తోంది.