డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు చార్మి సిట్ కార్యాలయంలో విచారణకు హాజరైన చార్మి ఛార్మిని మాత్రమే కార్యాలయంలోకి తీసుకెళ్లిన అధికారులు

డ్రగ్స్ కేసులో సినీ నటి చార్మి సిట్ ముందు విచారణకు హాజరైంది. సిట్ కార్యాలయానికి చేరుకున్న చార్మి బౌన్సర్ల రక్షణ మధ్య సిట్ కార్యాలయానికి వెళ్లింది. సాధారణంగా చాలా మాడ్రన్ గా దుస్తులు ధరించి పబ్లిక్ ప్లేసెస్ లో కనిపించే చార్మి.. సిట్ కార్యాలయానికి మాత్రం నీలం రంగు శారీలో ఫుల్ కవర్ చేసుకుని.. ఒక సాదాసీదా లేడీగా సిట్ కార్యాలయానికి వచ్చింది.

ఇక ఛార్మితో కెల్విన్ కు గల సంబంధాలపై ప్రధానంగా సిట్ ప్రశ్నించనుంంది. కెల్విన్ ఫోన్ లో చార్మి దాదా అని ఎందుకు నేమే ఫీడ్ చేసుకున్నాడు... కెల్విన్ తో వెయ్యి సార్లకు పైగా వాట్సాప్ చాట్ చేయాల్సిన అవసరం ఏంటి... పోర్చుగల్ కు తరచుగా వెళ్లినట్లు కనిపిస్తోంది దానికి కారణాలేంటి.. పూరీతో గల సంబంధాలేంటి.. డ్రగ్స్ తీసుకుంటారా.. లాంటి ప్రశ్నలతో చార్మిని సిట్ స్క్రూయింగ్ చేయనుంది. ఇప్పటికే చార్మి విచారణ కీలకం కానుందని సిట్ అధికారులు చెప్పిన నేపథ్యంలో... చార్మి విచారణపై సర్వత్రా ఆసక్రి నెలకొంది.

అయితే విచారణకు హాజరవుతానని తొలిత చెప్పిన చార్మి సిట్ దర్యాప్తు తీరు సరిగా లేదని హైకోర్టులో పిటిషన్ వేసి అందర్నీ షాక్ కు గురిచేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తొలుత విచారణకు సిట్ కార్యాలయానికే వస్తానని తెలిపిన ఛార్మి.. సడెన్ గా యు టర్న్ తీసుకుని హైకోర్టును ఆశ్రయించడం సర్వత్రా ఆసక్తి రేపింది.

 ఛార్మి పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు ఇరు పక్షాల వాదోపవాదాలు పరిశీలించింది. ఛార్మి లాయర్ వాదనలు బలంగానే వినిపించారు. ఛార్మి నిందితురాలు కాదని, కనీసం సాక్షి కూడా కాదని.. అలాంటప్పుడు శాంపిల్స్ తనకు ఇష్టం లేకుండా ఎలా ఇస్తారని చార్మి లాయర్ వాదించారు. ఆర్టికల్ 20 ప్రకాలం చార్మిని స్వేచ్ఛాయుత వాతావరణంలో విచారించాలని లాయర్ కోర్టుకు విన్నవించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విచారణ ఎదుర్కోవాల్సినంది మహిళ కాబట్టి ఆమె కోరిన చోట విచారిస్తే మేలని, అంతేకాక చార్మి ఒక మహిళ కాబట్టి.. మహిళాధికారులే విచారించాలని హైకోర్టు సూచించింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా.. ఛార్మి సిట్ కార్యాలయానికే విచారణకు హాజరైతే బాగుంటుందని.. లాయర్ విష్ణు వర్దన్ రెడ్డి సూచిస్తున్నారు. ఇక అవసరమైతే మరో రోజు విచారించుకోండి కానీ.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు మధ్య మాత్రమే విచారించాలని సిట్ కు సూచించింది హైకోర్టు.

అయితే చార్మికి మాత్రం విచారణకు హాజరు కావాల్సిందేనని, తోడుగా అడ్వకేట్ ను వెంటబెట్టుకుని వెళ్లడానికి అనుమతివ్వబోమని కోర్టు స్పష్టం చేసింది. ఇక అనుమతి లేకుండా సిట్ చార్మి శాంపిల్స్ తీసుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. మొత్తంమమీద సిట్ కార్యాలయానికి చార్మి చేరుకుంది. విచారణ అధికారులు శ్రీనివాస్ రావు, శ్రీనివాస్ ల నేతృత్వంలో మహిళా అధికారులు చార్మిని విచారిస్తున్నారు. 

ఇక అకున్ సబర్వాల్ పంజాబీ కావడం, చార్మి కూడా పంజాబీ కావడం అవసరమైతే భాషా పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా.. తెలుగులోనే కాక పంజాబీలో కూడా విచారించే వెసులుబాటు కూడా ఉంది.