హీరోయిన్ పై చార్జ్ షీట్?

First Published 18, Jun 2018, 4:43 PM IST
charge sheet against amala paul and suresh gopi
Highlights

ప్రముఖ నటి అమలాపాల్ నకిలీ అడ్రెస్ తో తన కారుని రిజిస్టర్ చేయించి ప్రభుత్వానికి పన్ను 

ప్రముఖ నటి అమలాపాల్ నకిలీ అడ్రెస్ తో తన కారుని రిజిస్టర్ చేయించి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయటకు రావడంతో ఆమె కోర్టుకి లొంగిపోయింది. ఆ వెంటనే బెయిల్ పై బయటకు వచ్చింది. అయితే ఈ కేసులో ఇప్పుడు ఆమెపై చార్జ్ షీట్ నమోదు చేయాలని కేరళ గవర్నమెంట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వానికి దాదాపు రూ.20 లక్షల పన్నుని కట్టాల్సి వస్తుందని అమలపాల్ ఫేక్ అడ్రెస్ తో తన కారుని రిజిస్టర్ చేయించుకుంది. అయితే ఈ కేసులో అమలాపాల్ ను మాత్రమే కాదు అలా పన్ను ఎగ్గొట్టిన వారు ఇంకెవరైనా ఉన్నారేమోనని క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగింది. దీంతో సీనియర్ నటుడు సురేష్ గోపి, హీరో ఫహాద్ ఫజిల్ వంటి తారలు కూడా పన్నుల ఎగవేత కేసులో పట్టుబడ్డారు.

కేసు కోర్టులో ఉండగానే.. గవర్నమెంట్ పన్ను చెల్లించే అవకాశం నిందితులకు ఇచ్చింది. ఈ క్రమంలో ఫహద్ ఫాజిల్ పన్ను చెల్లించడంతో ఆయనపై కేసుని ఎత్తివేశారు. కానీ అమలాపాల్, సురేష్ గోపి మాత్రం పన్ను చెల్లించలేదు. సురేష్ గోపి రాజ్యసభ మెంబర్ కావడంతో లాయర్ల సలహాల మేరకు ఆయనపై చర్యలు తీసుకోనున్నారు. ముందుగా అమలాపాల్ పై చార్జ్ షీట్ నమోదు చేయబోతున్నారు.  

loader