ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ పవన్ చరణ్ కాంబినేషన్ సెట్ అయ్యింది

First Published 24, Mar 2018, 1:18 PM IST
Charan to act in pk creative works
Highlights
  • ప్రస్తుతం పవన్ సినిమాలు చేసే అవకాశం లేదని ఆయనే చెప్పేశారు
  • రెగ్యులర్ పాలిటిక్స్ లోకి వచ్చి ఎదో తన స్టైల్ లో కొనసాగుతున్నాడు
  • పీకే క్రియేటివ్ వర్క్స్ లో చరణ్ తో ఒక సినిమా తీసే ఆలోచనలో పవన్ ఉన్నాడట

ప్రస్తుతం పవన్ సినిమాలు చేసే అవకాశం లేదని ఆయనే చెప్పేశారు. రెగ్యులర్ పాలిటిక్స్ లోకి వచ్చి ఎదో తన స్టైల్ లో కొనసాగుతున్నాడు. మరి పార్టీని నడపాలంటే ఎంతో కొంత డబ్బు అవసరం కాబట్టి సినిమాలను చేయాలనీ పవన్ ఆలోచిస్తున్నాడు. అంటే హీరోగా కాదులెండి. నిర్మాతగా సినిమాలను చేయాలనీ అనుకుంటున్నట్లు సమాచారం. 

అవసరం అయితే మెగా హీరోలతోనే సినిమాని నిర్మించాలని అనుకుంటున్నారట. పీకే క్రియేటివ్ వర్క్స్ లో నటించడానికి మెగా యువ హీరోలు ఎవరైనా సరే ముందుకు రాకుండా ఉండలేరు. ముఖ్యంగా రామ్ చరణ్ ఇప్పటికే బాబాయ్ జనసేనకు చాలా సార్లు మద్దతు ఇస్తున్నాడు. కొన్ని రూమర్స్ ప్రకారం మొదట చరణ్ బాబాయ్ ప్రొడక్షన్ లో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ విధంగా చేస్తే పవన్ కి పాలిటిక్స్ లో ఆర్థికంగా చరణ్ హెల్ప్ చేసినట్టు అవుతుంది. మరి ఈ ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

loader