అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చలపతిరావు

chalapathi rao injured during film shoot
Highlights

  • సీనియర్ నటుడు చలపతిరావుకు స్వల్ప గాయాలయ్యాయి.
  • షూటింగ్ చేస్తుండగా బస్సు వెనుక నిచ్చెన ఎక్కుతుండగా చలపతిరావు కింద పడ్డారు
  • ప్రస్తుతం చలపతిరావు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

సీనియర్ నటుడు చలపతిరావుకు స్వల్ప గాయాలయ్యాయి. ఫిల్మ్‌సిటీలో షూటింగ్ చేస్తుండగా బస్సు వెనుక నిచ్చెన ఎక్కుతుండగా చలపతిరావు కింద పడ్డారు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చలపతిరావు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్లరి నరేష్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రమాదం జరిగినట్టు సమాచారం. 

చలపతిరావు ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. చలపతిరావు ఆరోగ్య పరిస్థితిని చిత్ర నిర్మాత, డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. చలపతిరావు ఆరోగ్యంపై హీరో నరేష్‌ వాకబు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

loader