సెన్సార్ టాక్: ఛల్ మోహన రంగ

Chal Mohan Ranga Censor report
Highlights

సెన్సార్ టాక్: ఛల్ మోహన రంగ

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఛల్ మోహన రంగ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ లెంగ్త్ కామెడీతో ఇరగదీసేశారట. అలాగే ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సున్నితంగానే ఉన్న అసలు ఊహించలేని విధంగా ఉంటుందట. ఇక సెకండాఫ్ అయితే రొమాంటిక్ సన్నివేశాలతో నితిన్- మేఘా ఆకాష్ లు ప్రేమను పండించేశారని అంటున్నారు. 

అయితే.. అటు కామెడీ విషయంలో కానీ.. ఇటు రొమాన్స్ విషయంలో కానీ ఎక్కడా కొంచెం కూడా హద్దులు దాటకపోవడంతోనే యూ సర్టిఫికేట్ లభించిందని అంటున్నారు. త్రివిక్రమ్ మార్క్ కామెడీ సన్నివేశాలు చాలానే పడ్డాయట. మొత్తం మీద మోహన రంగడు.. బాక్సాఫీస్ కళ్లెం పట్టుకుని ఛల్ ఛల్ మనేందుకు పర్ఫెక్టుగా సిద్ధం అయిపోయాడు.

loader