Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 22వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో రిషి మన ప్రాజెక్ట్ హెడ్ వసుధార గారు మాట్లాడతారు అనగా అప్పుడు జగతి,మహేంద్ర రిషి ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు అనుకుంటూ ఉంటారు. అప్పుడు వసుధార నిలబడి స్పీచ్ ఇస్తుండగా మీరు కూర్చోనైనా మాట్లాడండి పర్వాలేదు అంటాడు రిషి. ఇప్పుడు వసుధార మాట్లాడడానికి తడబడుతూ ఉండగా అప్పుడు రిషి లాప్టాప్ ఓపెన్ చేసి ఆల్ ద బెస్ట్ మిషన్ ప్రాజెక్టు హెడ్ గారు అని మెసేజ్ చేస్తాడు. అప్పుడు రిషి వసుధార ఏం మాట్లాడాలి అన్నది ఒక్కొక్కటిగా మెసేజ్ చేస్తూ ఉండగా మెసేజ్లు చూసి వసుధార మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి అందరికీ వివరిస్తూ ఉంటుంది.
అప్పుడు మీటింగ్ అయిపోతుంది.. అప్పుడు వసుధార దగ్గరికి రిషి వచ్చి కంగ్రాట్స్ ఎంహెచ్ కారు చాలా బాగా మాట్లాడారు అని అంటాడు. ఎంహెచ్ అంటే ఏమిటి రిషి అని మహేంద్ర అనడంతో మిషన్ ప్రాజెక్టు హెడ్ కదా డాడ్ అని అంటాడు. అప్పుడు థాంక్యూ ఎండి గారు అనగా థ్యాంక్స్ నాకెందుకు అనడంతో ఐడియా ఇచ్చారు కదా అని అంటుంది వసుధార. ఆ తర్వాత వసుధార నడుచుకుంటూ వెళుతుండగా జగతి ఎదురుపడి మీటింగ్లో మంచి మంచి విషయాలు చెప్పావు చాలా బాగా మాట్లాడావు అని అంటుంది. ఇందులో మీ అబ్బాయి గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది మేడం అని అంటుంది.
అప్పుడు జగతి ఎమ్ హెచ్ అంటే ఏమిటి అనగా వసుధార చెప్పబోతుండగా ఇంతలో రిషి అక్కడికి రావడంతో జగతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రిషి తన క్యాబిన్ లోకి వెళ్లి కార్ కి కనిపించడం లేదు అని వెతుకుతూ ఉంటాడు. మరోవైపు వసుధర కారులో హాయిగా కూర్చుని కార్ కీస్ తో ఆడుకుంటూ ఉండగా ఏంటిది చెప్పకుండా కార్ కీస్ తీసుకుని వచ్చావు అనడంతో కారులో కూర్చోవాలంటే కార్ కీస్ కావాలి కదా సార్ అని వెటకారంగా సమాధానం చెబుతుంది. కార్ దిగు అనడంతో నేను దిగను సార్ నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి నేను డ్రాప్ చేయను అని అంటాడు రిషి. లిఫ్ట్ ఇవ్వకపోతే ఎవరైనా రిక్వెస్ట్ చేస్తారు నువ్వేంటో బెదిరిస్తున్నావు అని అంటాడు రిషి.
అప్పుడు వారిద్దరూ ఫన్నీగా వాదించుకుంటూ ఉంటారు. మరొకవైపు దేవయాని చక్రపాణి దగ్గరికి వెళ్లి ముగ్గురు ఆడపిల్లల తండ్రివి నీకు కనీసం మర్యాద కూడా తెలియదా అని అంటుంది. నేను నువ్వు ఇచ్చే మర్యాదల కోసం రాలేదు మీ వసుధారని మా రిషి మీదకు ఎందుకు వసుగోల్పావు అని అడగడానికి వచ్చాను అంటుంది దేవయాని. అప్పుడు చక్రపాణి సీరియస్ అవుతూ ఏంటండీ ఏం మాట్లాడుతున్నారో వసుగొల్పాను అని అంటాడు. చక్రపాణి ఇక్కడ అనడంతో మొన్నటి వరకు కోపంతో ఊగిపోయాను నా అసలు నిజ స్వరూపం నీకు తెలియదు అనడంతో దేవయాని ఇక్కడ రిషి ని పెంచి పెద్ద చేశాను అనగా ఆ మర్యాద ఇచ్చే ఇంత వరకు మౌనంగా ఉన్నాను అంటాడు చక్రపాణి.
డబ్బు కావాలంటే మొఖానవిసిరి కొడతాను తీసుకుని వెళ్లిపోండి అనడంతో వెంటనే చక్రపాణి నీ కళ్ళకు ఎలా కనిపిస్తున్నావు అని అంటాడు. మా పరువు గురించి నీకు తెలుసా అనగా అమ్మాయిని ఎరవేస్తున్నావ్ నీకు పరువు ఏంటి అనడంతో నోరు మూయండి అని అనగా దేవయాని షాక్ అవుతుంది. మర్యాదగా మాట్లాడు అనడంతో ఏంటమ్మా మర్యాద ఎలా ఉంటుంది మర్యాద అని సీరియస్ అవుతాడు చక్రపాణి. ఇంట్లోకి వచ్చావు వెళ్లాలని లేదా నా ముందే నా కూతురు గురించి అలా మాట్లాడతావా అని సీరియస్ అవుతాడు. ఇదిగో నా గురించి నీకు తెలియదు అనడంతో చాలా మా రిషి సార్ వాళ్ళ పెద్దమ్మ అన్న ఒక్క మర్యాద ఇచ్చి ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు.
ఇంతలోనే రిషి అక్కడికి వచ్చి పెద్దమ్మ అని అరవడంతో దేవయాని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార మార్నింగ్ తొందరగా వచ్చేయ్ అని చెప్పి దేవయానిని పిలుచుకొని వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత దేవయాని కార్లో రిషి ఇప్పుడు ఏమంటాడో అనవసరంగా వెళ్లాను అని టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో వసుధర థాంక్యూ సార్ అని మెసేజ్ చేయడంతో దేనికి అని రిప్లై ఇస్తాడు రిషి. అన్నింటికీ సార్ అనగా అన్నింటికి అంటే అని రిప్లై ఇస్తాడు. అప్పుడు కలిసినప్పుడు చెప్తాను సార్ అని అంటుంది వసుధార. అప్పుడు ఇద్దరు చాట్ చేసుకుంటారు. అప్పుడు వారిద్దరు వెటకారంగా చాట్ చేసుకుంటూ ఉంటారు. ఎవరు రిషి అనగా వసుధారా అనడంతో ఒక రగిలిపోతూ ఉంటుంది దేవయాని. వసుధార నాకు మధ్య కాలేజీ పరంగా చాలా ఉన్నాయి పెద్దమ్మ మీరు ఇక్కడ వరకు రాకుండా ఉండాల్సింది అంటాడు రిషి.
నేను నీకోసమే వెళ్లాను రిషి అనగా మీరు నా గురించి ఎక్కువగా ఆలోచించకండి అని అంటాడు రిషి. నాకు వసుధార కు మధ్య ఎవరైనా ఉంటే నాకు నచ్చదు నా సమస్యలు నేనే పరిష్కరించుకుంటాను అనడంతో దేవాయని షాక్ అవుతుంది. మరొకవైపు ధరణి వంటలు చేసుకుంటూ ఉండగా జగతి దేవయాని అక్కయ్య ఎక్కడికి వెళ్లారు అని తెలియదు అని అంటుంది. అప్పుడు మహేంద్ర వదిన బయటికి వెళ్ళింది అంటే ఎవరికో మూడినట్టే అని అంటాడు.
