Asianet News TeluguAsianet News Telugu

ఇకపై సినిమాల్లో నో సిగరెట్, నో మందు.. హద్దు దాటితే ఏ సర్టిఫికెట్

  • ఇకపై సినిమాల్లో మందు, సిగరెట్ బంద్
  • బాటిల్ చూపడం తప్పనిసరి అంటే ఏ సర్టిఫికెట్ ఇస్తామంటున్న సీబీఎఫ్సీ
  • కారణం లేకుండా మందు, పొగ బెడితే కట్ చేస్తామంటున్న సెన్సార్ బోర్డు
cbfc imposes ban on smoking and boozing in cinemas

మన హీరోలు స్టైలిష్ గా దమ్ము కొట్టి... దుమ్మురేపుతుంటే.. మన జనం క్లాప్స్ కొట్టి కిక్కు పొందుతుంటారు. ఒక హీరో దమ్ముగానీ కొట్టాడంటే... హీరోయిజం మరో లెవెల్ కు పోతుంది. అసలు సినిమాల్లో ఒక్క పబ్ సీనో, బార్ సీనో, కనీసం ఓ సిగరెట్ తాగే సీనో లేకుండా మనం సినిమా చూసి వుండం. మన హీరోహీరోయిన్లు చాలా మంది ఇలా సిగరెట్టో, మందో, మరోటో తీసుకుంటూ.. స్క్రీన్ పై మనల్ని అలరించినవారే.

 

కానీ ఇకపై అది జరగదు. అప్పుడెప్పుడో తీసిన దేవదాస్ సినిమా రీమేక్ చేయాలన్నా... మందో, సిగరెట్టో తాగే సీన్స్ వాటిలో వుండవు. ఎందుకంటే.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి) తాజాగా నిషేధం విధించింది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో లిక్కర్ బాటిల్ వాడాల్సి వచ్చినా దాన్ని బ్లర్ చేసి వాడాలి తప్ప నేరుగా చూపేందుకు వీల్లేదు.

 

కొన్ని లక్షల మంది అభిమానులుండే నటీనటులు మద్యం తాగటం, సిగరెట్ లాంటివి తాగడం కుదరదని సెన్సార్ బోర్డు సభ్యుడొకరు తేల్చి చెప్పారు. ఒకవేళ తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చినా దానికి సరైన కారణం కనిపించకుంటే సెన్సార్ బోర్డు కత్తెరకు పని చెప్తుంది. ఒకవేళ అల్కహాల్ తో కూడిన సీన్స్ పెట్టాలనుకుంటే ఏ సర్టిఫికెట్ తో సినిమాకు సర్టిఫికెట్ తీసుకోవాల్సి వుంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios