టాలీవుడ్ లో అడుగుపెట్టిన అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కేథరిన్ త్రెస్సా. అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో ఎమెల్యే పాపగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ముద్రపడిపోయింది.  పైసా సినిమాతో హిరోయిన్ గా పరిచయమైన క్యాథరిన్ లాస్ట్ ఇయర్ నేనే రాజు నేనే మంత్రి తో పెద్ద హిట్టే అందుకుంది. జయజానకి నాయక సినిమాలో ఐటెం సాంగ్ తో అలరించిన ఈ యాపిల్ బ్యూటీ  ఇటీవలే ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విశేషాలు షేర్ చేసుకుంది.

 

తనకు వచ్చిన ప్రతి సినిమా ఒప్పుకునే టైప్ తాను కాదని, అసలు కథ నచ్చకుంటే ఒప్పుకునే సమస్యే లేదని... కథ విషయంలో చాలా అలోచించి నిర్ణయం తీసుకుంటానన్న కేథరిన్ కొన్ని విషయాలపై చాలా స్పష్టంగా తన అభిప్రాయాలు చెప్పింది. ప్రభాస్ కు అక్కయ్యగా - పవన్ కళ్యాణ్ కు వదినగా ఆఫర్స్ వస్తే వదిలేస్తానని స్పష్టం చేసింది. అయినా దర్శక నిర్మాతలు ప్రస్తుతానికి ఆమెను అలా ఊహించడం కష్టమే. ప్రేక్షకులు కూడా ఎమ్మెల్యే పాప ఇలాంటి పాత్రలు చేస్తే ఎలా అనటం ఖాయం.

 

పెళ్లి విషయంలో మాత్రం తెలుగు అబ్బాయినే చేసుకోవాలనుందని తన మనసులో మాట బయట పెట్టింది. తనలో ప్రత్యేక ఆకర్షణ తన కళ్ళే అంటోంది. అదీకాక.. ఇది తన మాట కాదని కృష్ణవంశీ, నీలకంట, బోయపాటి శీను లాంటి వాళ్ళంతా వాటి గురించే మెచ్చుకోవడం తను మర్చిపోలేను అంది.

 

దుబాయ్ లో జన్మించిన కేథరిన్.. కన్నడ సినిమా శంకర్ ఐపిఎస్ తో దునియా విజయ్ సరసన పరిచయమైన కేథరిన్ తెలుగులో చమ్మక్ చల్లోతో ఎంట్రీ ఇచ్చింది. కృష్ణ వంశీ పైసా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా తనకు మంచి పేరు మాత్రం తెచ్చిపెట్టింది. అల్లు అర్జున్ తో చేసిన ఇద్దరమ్మాయిలతో కేథరిన్ కు బ్రేక్ ఇస్తే సరైనోడు టాలీవుడ్ లో నిలబెట్టింది. తెలుగులో అవకాశాలకే ప్రాధాన్యం ఇస్తున్నానంటున్న కేథరిన్ పెళ్లి విషయంలో మాత్రం తొందరపడే ప్రసక్తి లేదు అని తేల్చేసింది.