యూట్యూబ్, పేస్ బుక్, ట్విట్టర్.. ఇలా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే ట్రెండింగ్. మలయాళి పిల్ల ప్రియా ప్రకాష్ వారియర్ గురించే యువత మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఓరు అడార్ లవ్ చిత్రానికి సంబందించిన ఓ వీడియోని ఇటీవల విడుదల చేసారు. ఆ పాటలో ప్రియా వారియర్ కన్నుగీటిన విధానం, ఆమె హావభావాలకు  కురాళ్ళ హృదయాలు మటాష్ అయిపోయాయి.

తాజాగా ప్రియా వారియర్ వివాదంలో చిక్కుకుంది. ఆ పాటపై హైదరాబాద్ లో ముస్లింలు కొందరు పోలీసులకు  ఫిర్యాదు చేశారు. కేవలం ఆ పాట వలన మలయాళీ భామ ప్రియా వారియర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఆమె తన హావ భావాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా హైదరాబాద్ లో కొందరు ముస్లింలు ఆ పాటపై కేసు నమోవు చేసారు. ప్రియా వారియర్ తో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, కేవలం ఆమె నటించిన ఆ పాటలోని లిరిక్స్ మాత్రమే అభ్యంతర కరంగా ఉన్నాయని కేసు నమోదు చేసిన వారు పేర్కొన్నారు.


ప్రియా వారియర్ చూపులు, హావ భావాలకు యువత కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా ఆమె కన్ను గీటిన విధానం కుర్రాళ్ళ హృదయాల్ని తొలిచేస్తోంది.టీనేజ్ ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఓరు అడార్ లవ్.. ప్రియవారియర్ పాట విడుదలకు ముందువరకు ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడుమాత్రం ఈ చిత్రం గురించి దేశం మొత్తం చర్చించుకుంటోంది.