సీతకు రావణుడితో ఉంటే న్యాయం జరిగేదేమో.. కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు!

case filed against kathi mahesh over his controversial comments
Highlights


ఈసారి ఏకంగా దేవుడినే విమర్శించాడు.. 

బిగ్ బాస్ సీజన్1 లో కంటెస్టంట్ గా పాల్గొని కాస్త ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు కత్తి మహేష్. పవన్ కళ్యాణ్ అలానే మెగాఫ్యామిలీపై విమర్శలు గుప్పించి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. అప్పట్లో కొంతకాలం పాటు ఏ టీవీ ఛానెల్ చూసిన కత్తి మహేషే కనిపించేవాడు.

అంతగా టీవీ ఛానళ్లు కూడా ఆయన వెంటపడ్డాయి. ఇప్పటివరకు మనుషులపై విమర్శలు చేసి బోర్ కొట్టిందో ఏమో ఈసారి ఏకంగా దేవుడినే టార్గెట్ చేశాడు కత్తి మహేష్. ఓ టీవీ ఛానెల్ ప్రోగ్రాం కోసం ఫోన్ లో మాట్లాడిన కత్తి.. 

'రామాయణం అనేది నాకొక కథ. రాముడు అనేవాడు ఎంత ఆదర్శవంతుడో.. అంత దగుల్బాజీ అని నేను నమ్ముతాను. ఆ కథలో సీత.. రావణుడితో ఉంటే బాగుండేదేమో.. ఆమెకు న్యాయం జరిగేదేమో.. అని నాకు అనిపిస్తుంటుంది' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో హిందూ జనశక్తి నేతలు కత్తి మహేష్ పై విరుచుకుపడ్డారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఈ కేసులో కత్తి మహేష్ తనను తాను సమర్ధించుకోవడానికి ఇంకెన్ని వ్యాఖ్యలు చేస్తాడో చూడాలి! 

loader