పార్టీకి వెళ్లి తప్పతాగి కారుని గుద్దిన డైరెక్టర్ బాబి

case filed against director bobby
Highlights

పార్టీకి వెళ్లి తప్పతాగి కారుని గుద్దిన డైరెక్టర్ బాబి

గబ్బర్‌సింగ్, జైలవకుశ ఫేం, టాలీవుడ్ డైరెక్టర్ బాబీకి కష్టాలు మొదలయ్యాయి. ఆయన సినిమాల మాట పక్కనబెడితే.. అతివేగంతో కారు నడుపుతూ మరో కారుని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒకరికి బలమైన గాయాలయ్యాయి. దీంతో డైరెక్టర్ బాబీపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే.. అమీర్‌పేట్‌కు చెందిన హర్మీందర్‌సింగ్ ఫ్యామిలీ సభ్యులతో ఆదివారం రాత్రి తన కారులో జూబ్లీహిల్స్‌లోని ఓ ఫంక్షన్‌కు అటెండయ్యాడు. అర్ధరాత్రి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో వీళ్లు ప్రయాణిస్తున్న కారుని జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 33 వద్ద.. డైరెక్టర్ దర్శకుడు బాబీ కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో హర్మిందర్ కారు వెనక పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే కారు దిగిన బాధితుడు, బాబీని నిలదీశాడు. ఈ క్రమంలో బాబీతోపాటు కారులోవున్న మరో ముగ్గురు హర్మిందర్‌ను బెదిరించే ప్రయత్నం చేశాడు. తానో పెద్ద డైరెక్టర్‌ అని, తనకు పెద్దలతో రిలేషన్ వుందని చెప్పాడు. పక్కనే తన ఇల్లు ఉందని కూర్చుని మాట్లాడుకుందామని అన్నాడు. అదే సమయంలో కారులోవున్న హర్మిందర్ తల్లికి చాతీలో నొప్పి రావడంతో హర్మిందర్ టెన్షన్ పడ్డాడు. ఈ క్రమంలో బాబీ అక్కడి నుంచి జారుకున్నాడు. హర్మిందర్  మాటల ప్రకారం బాబీ మధ్యం సేవించి ఉన్నాడని తెలుస్తోంది. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

loader