'బ్రాండ్ బాబు' సినిమాపై కేసు!

case filed against brand babu movie
Highlights

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడు చిత్రాల్లో 'బ్రాండ్ బాబు' ఒకటి. మిగిలిన రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను పట్టించుకునేవారు లేకుండా పోయారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఓ మహిళా జర్నలిస్ట్ కేసు పెట్టారు. 

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అసలు విషయమేమిటంటే.. సినిమాలో హీరోయిన్ తల్లిగా ఈ మహిళా జర్నలిస్ట్ ఫోటోను ఆమె అనుమతి లేకుండా వినియోగించారట. సినిమాలో ఓ సీన్ లో హీరోయిన్ చనిపోయిన తన తల్లిని గుర్తుచేసుకొని ఏడ్చే సందర్భంలో సదరు జర్నలిస్ట్ ఫోటోను ఉపయోగించారు చిత్రబృందం.

ఆమె పర్మిషన్ లేకుండా ఆ సీన్ లో ఫోటో వినియోగించడంతో ఆగ్రహానికి లోనైన ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె కంప్లైంట్ లెరకు ఐపీసీ 509 సెక్షన్ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుల్లితెర స్టార్ ప్రభాకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో సుమంత్ శైలేంద్ర అనే కన్నడ నటుడు తెలుగు తెరకు పరిచయమయ్యారు.   
 
loader