స్టార్ హీరో భార్య, కొడుకులపై కేసు!

case filed against bollywood actor mahaakshay
Highlights

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి కొడుకు మహాక్షయ్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి కొడుకు మహాక్షయ్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మహాక్షయ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి చేసిన ఫిర్యాదుతో ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. 

అసలు విషయంలోకి వస్తే.. ముంబైకి చెందిన ఒక అమ్మాయి మహాక్షయ్ తనతో మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అతడి కారణంగా గర్భం దాలిస్తే నాకు ఇష్టం లేకుండానే అబార్షన్ చేయించాడని ఆమె పేర్కొంది. అతడు చేసే తప్పలను తన తల్లి సపోర్ట్ చేస్తుంటుందని ఆమెపై కూడా ఫిర్యాదు చేసింది. ఆమె చేసిన కంప్లైంట్ మేరకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని కోర్టు ఆదేశించింది.

మహాక్షయ్ కు పెళ్లి కుదరడంతో ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు వచ్చింది. నటి మదాలస శర్మతో మహాక్షయ్ కు నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో వీరి పెళ్లి కూడా జరగబోతుంది. ఈ హీరోయిన్ తో కూడా మహాక్షయ్ మూడేళ్లుగా రిలేషన్షిప్ లో ఉన్నాడు. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించడంతో మార్చి నెలలో ఎంగేజ్మెంట్ జరిపించారు. ఈ క్రమంలో మరో యువతి తనను మోసం చేశాడంటూ మహాక్షయ్ పై కేసు నమోదు చేయడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.         

loader