ప్రముఖ సాహితీ వేత్త సినారే(డా||సి.నారాయణరెడ్డి) కన్ను మూత తెలుగు సినీ పరిశ్రమలో తనదైన సాహిత్యంతో గేయ రచనలో కొత్త ఒరవడి తెలుగు సినిమా రంగంలో దాదాపు 3500 వరకు అద్భుతమైన సాహిత్యంతో గేయ రచన
1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి, అదే ఏట ఆత్మ బంధువు చిత్రంలో చదువు రాని వాడవని దిగులు చెందకు, అనగనగ ఒక రాజు, అనగనగ ఒకరాణి లాంటి పాటలు మొదలు సినారె దాదాపు 3500 గీతాలు రచించారు. తెలంగాణ నుంచి అప్పటికే దాశరథి సినిమాలకు పాటలు రాస్తూ ఉన్నారు. ఆయన తర్వాత అంత బలమైన ముద్ర వేసిన కవి సినారె. సాహిత్య ఔచిత్యాలను పాటిస్తూనే ఆయన తెలుగు సినిమాలకు అద్భుతమైన, జనరంజకమైన పాటలు రాశారు. ఆయన పాటలు తెలుగు ప్రజల నోళ్లలో నిత్యం నానుతూ ఉంటాయి. నిజానికి, తొలి సినిమాతోనే ఆయన తనదైన ముద్ర వేశారు. గులే బకావళి కథ సినిమాకు ఆయన తొలిసారి పాటలు రాశారు. ఆ సినిమాకు రాసిన నన్ను దోచుకుందువటే, వన్నెల దొరసాని పాటకు ధీటైన పాట ఇప్పటికీ రాలేదంటే అతిశయోక్తి కాదు.
సంవత్సరం | సినిమా | సినిమా పాట |
1962 | అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, | |
1962 | ||
1962 | చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా, | |
1962 | ఎవరో నను కవ్వించి పోయేదెవరో | |
1963 | వగలరాణివి నీవే సొగసుకాడను నేనే | |
1963 | కిల కిల నవ్వులు చిలికిన | |
1963 | గాలికి కులమేది నేలకు కులమేది | |
1963 | దాచాలంటే దాగవులే దాగుడుమూతలు సాగవులే, మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది | |
1963 | నీ కోసం నా గానం నా ప్రాణం | |
1963 | పూవై విరిసిన పున్నమివేళా బిడియము నీకేలా బేలా | |
1964 | ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో | |
1964 | నీలి కన్నుల నీడల లోనా | |
1964 | అంతగా నను చూడకు మాటాడకు, వింతగా గురిచూడకు వేటాడకు | |
1964 | కనులు కనులు కలిసెను కన్నె వయసు పిలిచెను, | |
1964 | తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే | |
1965 | కనులీవేళ చిలిపిగ నవ్వెను | |
1966 | నాలోని రాగమీవె నడయాడు తీగవీవె | |
1968 | విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా | |
1968 | అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి | |
1968 | ఇదేనా మన సాంప్రదాయమిదేనా | |
1969 | కృష్ణా నీ పేరు తలచినా చాలు | |
1970 | ఓ నాన్నా నీ మనసే వెన్న | |
1970 | నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు | |
1970 | రా వెన్నెల దొరా కన్నియను చేరా | |
1971 | కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా | |
1971 | రింఝిం రింఝిం హైదరబాద్ | |
1972 | గున్న మామిడి కొమ్మ మీదా గూళ్లు రెండున్నాయీ | |
1972 | అణువూ అణువున వెలసిన దేవా కనువెలుగై మము నడిపింప రావా | |
1972 | అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం | |
1973 | మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి | |
1973 | శారదా, నను చేరగా ఏమిటమ్మా సిగ్గా, ఎరుపెక్కే లేత బుగ్గా | |
1974 | వస్తాడు నా రాజు ఈ రోజు | |
1974 | కృష్ణవేణి, తెలుగింటి విరిబోణి, కృష్ణవేణి, నా ఇంటి అలివేణి | |
1974 | స్నేహమేరా నా జీవితం స్నేహమేరా శాశ్వతం | |
1974 | మల్లెకన్న తెల్లన మా సీత మనసు | |
1975 | ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే | |
1975 | మారాలీ మారాలీ మనుషుల నడవడి మారాలి | |
1975 | గోగులు పూచే పూగులు కాచే ఓ లచ్చ గుమ్మడీ | |
1976 | శివరంజనీ నవరాగినీ వినినంతనే నా | |
1978 | అభినవ తారవో నా అభిమాన తారవో | |
1980 | కలయైనా నిజమైనా కాదన్నా లేదన్నా | |
1984 | చందురుడు నిన్ను చూసి | |
1985 | లాలి లాలి లాలీ లాలి, వటపత్రశాయీ వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి | |
1986 | రేపటి పౌరులం | |
1989 | జోలా జోలమ్మ జోల నీలాలా కన్నులకు నిత్యమల్లె పూలజోల | |
1990 | 20వ శతాబ్దం ఇది | |
1997 | ఒసే రాములమ్మా | |
2001 | కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా | |
2003 | ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ | |
2009 | జేజమ్మా జేజమ్మా |