కత్తి, సుత్తి లాంటి వాటిని పట్టించుకోవద్దన్న బన్నీ వాసు

First Published 8, Dec 2017, 2:05 AM IST
bunny vasu suggests pawan fans to ignore kathi mahesh
Highlights
  • పవన్ కళ్యాణ్ అభిమానులకు బన్నీ వాసు పిలుపు
  • పవన్ పై విమర్శలు చేస్తున్న కత్తి మహేష్ ను పట్టిచ్చుకోవద్దన్న బన్నీ వాస్
  • కత్తి, సుత్తి కనిపిస్తుంటాయి.స్పందించే అవసరం లేదన్న బన్నీ వాసు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో, మీడియాలో విరుచుకుపడే సినీ క్రిటిక్ కత్తి మహేష్ కు... పవన్ అభిమానులు టార్గెట్ చేయటం... సోషల్ మీడియాలో యుద్ధంలా వుంటుందంతా. తనను పవన్ అభిమానులు బెదిరిస్తున్నారని అంటూనే.. పవన్ మీద తన కమెంట్స్ మాత్రం తగ్గించట్లేదు కత్తి.

 

తాజాగా పవన్ వైజాగ్ పర్యటనలో చేస్తున్న వ్యాఖ్యల మీదా కత్తి స్పందిస్తున్నాడు. పవన్ ప్రతి కామెంట్ మీద తనదైన విశ్లేషణ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాడు. దీనిపై పవన్ అభిమానుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఐతే పవన్ ఫ్యాన్స్ అనవసరంగా కత్తి గురించి కామెంట్ చేసి.. అతడిని టార్గెట్ చేసి అతడికి పబ్లిసిటీ తెచ్చిపెట్టొద్దని అంటున్నాడు బన్నీ వాసు. ఇంతకుముందే ఒకసారి కత్తిని ఉద్దేశించి ఇదే తరహాలో కామెంట్ చేశాడు బన్నీ వాసు. ఇప్పుడు మరోసారి మహేష్ కత్తిపై అతను కామెంట్లు చేశాడు. ‘‘మార్కెట్లో ‘కత్తి’లు.. ‘సుత్తి’లు ఉంటాయి.. పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందించాల్సిన అవసరం లేదు’’ అని బన్నీ వాసు అన్నాడు.

 

ఎందుకంటే  పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా కత్తి మహేష్ చేసిన కొన్ని కామెంట్లు చూస్తే మహేష్ కత్తి పవన్ ను ఏ రేంజ్ లో విమర్శించాడో అర్థమవుతుంది. తన కామెంట్లలో..  ‘‘సో... మొత్తానికి జనసేన ముఖ్య ఉద్దేశం ప్రజారాజ్యం పార్టీని చిరంజీవిని మోసం చేసినవాళ్ళని చెప్పుతో కొట్టడం అన్నమాట! అది కాంగ్రెస్ తో కలిస్తేనే సాధ్యం అని చెప్పకనే చెప్పాడు. కక్ష సాధింపు ముఖ్యమైనప్పుడు లక్ష్య సాధన ఏముంటుంది?!?’’ 

 

‘‘తప్పు చేస్తే నన్ను కూడా నిలదీయండి! పొరపాటు చేస్తానేమోగాని.. తప్పు మాత్రం చేయను! - పవన్ కళ్యాణ్ అంటూ పవన్ వ్యాఖ్యలు పెట్టి... ముందు మీ అభిమానుల గుండాయిజాన్ని ఆపే మంచి పనిచెయ్యి. లేకపోతే తప్పో పొరపాటో కాదు మీకు మీ పార్టీకి అదొక గ్రహపాటుగా మారే చాన్స్ ఉంది’’ ‘‘నోరువిప్పిన ప్రతిసారీ అజ్ఞాతవాసి కాదు అజ్ఞానవాసి అని తేలుతొంది. అంతే!’’ అంటూ పోస్ట్ లు పెట్టాడు కత్తి మహేష్.

 

దీంతో ఆగ్రహించిన బన్నీ వాసు పవన్ అభిమానులు కత్తి, సుత్తిలను పట్టించుకుని పెద్ద చేయాల్సిన అవసరం లేదని, కత్తి సుత్తిని పట్టించుకోవద్దని బన్నీ వాసు పవన్ అభిమానులకు పిలుపునిచ్చాడు.

loader