వర్మా.. నీ అంతు చూస్తాం : బన్నీ వాసు

First Published 19, Apr 2018, 1:44 PM IST
Bunny vasu strong warning to varma
Highlights

వర్మ కి వార్నింగ్ ఇచ్చి బన్ని వాసు

శ్రీరెడ్డి అలా తిట్టిమని నేనే చెప్పా.. అంటు వర్మ రిలీజ్ చేసిన వీడిన పెద్ద దుమారమే లేపింది. వర్మ చెప్పిన మాటలకు ఫ్యాన్స్ మొత్తం కోపం ఊగిపోతున్నారు.తాజాగా వర్మపై నిర్మాత బన్నీ వాసు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. దీనిపై ఫేస్‌బుక్‌లో వర్మను హెచ్చరిస్తూ పోస్ట్ చేశారు.

‘రాంగోపాల్ వర్మ.. పవన్ కల్యాణ్ అభిమానులను సంయమనం పాటించాలని తాము ఎప్పుడూ కోరుతుంటాం... కానీ ఇప్పుడు నీవు ఆడించిన నాటకం మొత్తం తెలుసుకున్న తర్వాత ఇక వారిని ఆపే ప్రయత్నం చేయబోం... తామంతా బయటకు వస్తున్నాం... యుద్ధానికి సిద్ధంగా ఉండు.. తమ సత్తా ఏంటో నీకు రుచి చూపిస్తాము. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇలాంటి వ్యూహాలనే అనుసరించారు.. మెగా ఫ్యామిలీ మద్దతుదారులమంతా ఈ రోజు సమావేశం కాబోతున్నాం... సాయంత్రం తమ నిర్ణయం ఏమిటో ప్రకటిస్తాం’ అంటూ ఘాటుగా హెచ్చరించాడు. ‘ఈ రోజు సాయంత్రం టీవీలను ఆన్ చేసి ఉంచండి’ అంటూ మరో పోస్ట్ పెట్టాడు.

loader