రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్!

రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్!

ఇప్పటివరకు హీరోలుగా మాత్రమే బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ ఒకే కుటుంబానికి చెందిన మెగాహీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ . ఇప్పుడు  వాళ్లు నిర్మాతలుగా కూడా తమ సత్తాను చాటాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ కొనిదల ప్రొడక్షన్స్ పతాకంపై సినిమాలు నిర్మించడం మొదలుపెట్టాడు. నిర్మాతగా చరణ్ చేసిన మొదటి చిత్రం 'ఖైదీ నెంబర్ 150' తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే బ్యానర్ లో 150 కోట్ల బడ్జెట్ తో 'సై రా నరసింహారెడ్డి' సినిమాను నిర్మించడానికి రెడీ అయిపోతున్నాడు రామ్ చరణ్. మరి ఈ విషయం ఏమైనా బన్నీను ఇన్స్పైర్ చేసిందేమో తెలియదు కానీ తను కూడా సొంతంగా నిర్మాణ సంస్థను మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే బన్నీ తండ్రి అల్లు అరవింద్ కు 'గీతాఆర్ట్స్' అనే బ్యానర్ ఉంది. 

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఆ బ్యానర్ పై తెరకెక్కించారు. బన్నీ కావాలంటే అదే బ్యానర్ లో పెట్టుబడులు పెట్టొచ్చు. కానీ అలా కాకుండా తనకంటూ ఓ సొంత బ్యానర్ ను స్థాపించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ బ్యానర్ ద్వారా కొత్త దర్శకుడు అను కె రెడ్డిని టాలీవుడ్ కు పరిచయం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి ఈ ఇద్దరి హీరోలు ఇప్పుడు తమ నిర్మాణ సంస్థలతో పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు నిర్మాతలుగా మారుతూ తమ సత్తాను చాటుతున్నారు. మరి బన్నీ ఊరుకుంటాడా..? తను కూడా అధృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 

 

ఇది కూడా చదవండి

https://goo.gl/Wer4Pp

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos