రామ్ చరణ్ ను ఇరుకున పడేస్తున్న బన్నీ బాబాయ్ నాగబాబు లాస్ కు కారణమైన అబ్బాయి సినిమా నాగబాబుకు లాభం చేకూరేలా బన్నీ ప్లాన్ చెర్రీతో లాస్ లు, బన్నీతో కాస్ లు అనేలా వ్యవహారం

బయటికి పెద్దగా కనిపించదు కానీ మెగా హీరోల్లో బన్నీకి, రామ్ చరణ్ కు మధ్య కనిపించని పోటీ వుందన్నది కాదనలేం. మెగా హీరోల క్లోజ్ సర్కిల్ ద్వారా ఆ వాస్తవంపై చెవులు కొరుక్కోవడం సహజంగా జరుగుతూనే ఉంటుంంది. అయితే... చెర్రీ, బన్నీల మధ్య ఉన్న ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో బన్నీ కాస్త రైజింగ్ అన్నది మాత్రం ఆగడం లేదు. ఇక బన్నీ తీసుకున్న ఓ నిర్ణయం ఇండస్ట్రీలో అనేక రూమర్స్ కు తెరలేపింది. బన్నీ కావాలనే రామ్ చరణ్ ను కార్నర్ లోకి నెట్టేందుకు అలా నిర్ణయించాడనేది రూమర్స్ పరమార్థం.

నాగబాబు స్వయానా చరణ్ కు బాబాయ్. అయితే చరణ్తో సినిమా తీసి దారుణంగా నష్టపోయాడు. ఆ నష్టాల సమయంలో అన్న చిరంజీవి ఆదుకోలేదని, అయితే నాగబాబును పవన్ కళ్యాణే ఆదుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. పవన్ తన డేట్ లు వగైరా చూసే వ్యవహారం అన్న నాగబాబుకు అప్పగించి, ఆర్థికంగా ఆదుకున్నారని గుసగుసలు వున్నాయి. అవన్నీ ఎంతవరకు నిజమో కానీ నాగబాబు ఆ తర్వాత మళ్లీ సినిమా తీయలేకపోయారు. మరోవైపు రామ్ చరణ్ కూడా మళ్లీ నాగబాబుకు చాన్స్ ఇవ్వలేదు. 

ఇప్పుడు వున్నట్లుండి ఎప్పటి విషయమో దృష్టిలో పెట్టుకుని బన్నీ నాగబాబును ఆదుకోవడానికి ముందుకు వచ్చాడని తెలుస్తోంది. నాగబాబు అంటే మెగా ఫ్యాన్స్ లో చాలా కీలకం. మెగా ఫ్యాన్స్ అందరికీ నాగబాబుతో సాన్నిహిత్యం వుంది. ఫ్యాన్ బేస్, సినిమాలు ఇలా అన్నింటా వెల్ ఫ్లాన్డ్ గా ముందుకు వెళ్తున్న బన్నీ, చాలా స్ట్రాటజిక్ గానే నాగబాబుకు తన సినిమా ప్రెజెంట్ చేసే అవకాశం ఇచ్చి, రాయల్టీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని వినిపిస్తోంది. ఇది బన్నీకి పెద్ద ప్లస్ పాయింట్. మరి నిర్మాతగా మారిన రామ్ చరణ్ ఇప్పుడు తన వంతుగా ఏం చేస్తాడో.

బన్నీకి క్రెడిట్ వస్తే వచ్చిందిలే అనుకుంటాడా.. లేక తాను కూడా బాబాయికి సపోర్ట్ ఇచ్చి... షబాష్ అబ్బాయ్ అనిపించుకుంటాడా చూడాలి.