Asianet News TeluguAsianet News Telugu

ఇప్పటికైతే సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు-బ్రాహ్మణి

  • సినిమా రంగ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చిన నారా బ్రహ్మణి 
  • నారా లోకేష్ ను పెళ్లాడిన నందమూరి బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి
  • ఇప్పటికైతే సినిమాల్లోకి వచ్చే ఆలోచన లేదు-బ్రాహ్మణి
brahmani gives clarity on movies entry
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలకృష్ణ కుటుంబం నుంచి మోక్షజ్ఞ సినీ పరిశ్రమ ఎంట్రీకి రెడీ అవుతున్నాడని వార్తలొస్తున్నాయి. మరో వైపు బాలకృష్ణ కూతురు, నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి సినిమాల గురించి ఆలోచన లేదంటోంది. రాజకీయాలు, సినిమా రంగంలోకి వచ్చే ఆలోచన లేదని బ్రాహ్మణి స్పష్టం చేసింది. తాను సినిమా ఫ్యామిలీ నుంచే వచ్చినా ఇప్పటి వరకు ఆ రంగంపై దృష్టి పెట్టలేదని స్పష్టం చేసింది.

 

ప్రస్థుతం దృష్టంతా హెరిటేజ్ అభివృద్ధిపైనే ఉందని నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. పాల ఉత్పత్తిలో దేశంలోనే హెరిటేజ్‌ను నెం.1 గా తీర్చిదిద్దుతామన్నారు. 10 లక్షల మంది రైతులకు హెరిటేజ్ ద్వారా సేవ చేస్తున్నామని, ఇంతకన్నా ఇంకా ఏం కావాలని ఆమె వ్యాఖ్యానించారు. శనివారం ఫిక్కీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ సహకారం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. హెరిటేజ్ డెయిరీ వ్యాపారాన్ని వచ్చే ఐదేళ్లలో రూ.6 వేల కోట్ల టర్నోవర్‌కు చేర్చడమే తన లక్ష్యమని చెప్పారు. డెయిరీ రంగంలో రిలయన్స్ డెయిరీ కొనుగోలు పూర్తి అయిందని, ఈ రంగంలో మరిన్ని కంపెనీల కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని బ్రాహ్మణి పేర్కొన్నారు.

 

ఇక ఫిక్కీ సదస్సుకు హాజరైన లోకేష్ మాట్లాడుతూ '' మా అమ్మ, బ్రాహ్మణి ఇద్దరూ కష్టపడుతూ ఉంటారు. నేను, నాన్న బాగా ఖర్చుపెడుతూ ఉంటాం. ఆడవాళ్ళ సమస్యలపై ఫిక్కీ సదస్సులో చర్చించాం. చాలా మంది మహిళలు వాళ్ళ ఆలోచనలను తెలియజేశారు. స్కూల్ పిల్లలకు పాలు ఇమ్మని చెప్పారు..'' అని లోకేష్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాజకీయాల్లో కానీ.. ఇంట్లో కానీ మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందన్నారు. టీడీపీలో ముందు నుంచీ మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని లోకేష్‌ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios