కల్యాణ్ రామ్, కాజల్ జంటగా తెరకెక్కుతున్న ఎంఎల్ఎ ఎంఎల్ఎ చిత్రంలో అలరించనున్న బ్రహ్మానందం షూటింగ్ స్పాట్ లో కాజల్ తో సెల్ఫీ సందర్భంగా బ్రహ్మి చేష్టలు

కామెడి కింగ్ బ్రహ్మనందం ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు విరబూసినట్టే. బ్రహ్మి సెట్స్ లో వుంటే షూటింగ్ అంతా సరదా సరదాగా గడిచిపోతుంటదని తోటి నటీనటులు పలు సందర్భాల్లో చెప్తుంటారు. రీల్ లైఫ్‌లోనే కాకుండా.. రియల్ లైఫ్‌లో కూడా హాస్యాన్ని పండిచే బ్రహ్మానందానికి సంబంధించిన ఆసక్తికరమైన ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తున్న ఎం.ఎల్‌.ఏ సినిమా ఆదివారం సెట్స్‌ పైకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాజల్ తొలిసారి కల్యాణ్ రామ్ సరసన లక్ష్మీ కల్యాణం చిత్రంతోనే తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ కాజల్, కల్యాణ్ రామ్ జోడీ కట్టడం విశేషం.

పదేళ్ల తర్వాత కల్యాణ్ రామ్‌తో కాజల్ ఈ సినిమా షూటింగ్‌లో కల్యాణ్, కాజల్, బ్రహ్మానందంపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందంతో కలిసి కల్యాణ్‌రామ్‌ తీసిన సెల్ఫీలను హీరోయిన్ కాజల్ తన ట్విటర్ పేజ్ లో చేసింది. నా తొలి చిత్ర సహ నటుడు నందమూరి కల్యాణ్‌రామ్‌తో.. కొత్త సినిమా ‘ఎం.ఎల్‌.ఏ.' సెట్స్‌ పై మొదటి రోజు.. గతస్మృతులు గుర్తుకు వస్తున్నాయి" అంటూ కాజల్ గతాన్ని గుర్తు చేసుకుంది. అయితే ఆ ఫొటో మాత్రం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

ఇంతకీ ఆ ఫొటో ఎలా వుందంటే.. కాజల్ అగర్వాల్‌ను బ్రహ్మానందం గట్టిగా కౌగిలిలో బంధించాడు. ఆమె చేతులో చేయేసి గట్టిగా అక్కడే అదిమేసి పోజిచ్చాడు. ఆ ఫోటోను కాజల్ తన ఇన్‌‍స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఎంఎల్‌ఏ చిత్రానికి ఉపేంద్ర మాధవ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్పీ, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై సీ భరత్‌చౌదరి, ఎంవీ కిరణ్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌ సమర్పిస్తున్నారు. ఈచిత్రానికి మణిశర్మ బాణీలు అందిస్తున్నారు.