గతంలో సంక్రాంతి బరిలో నిలిచిన మూడు సినిమాలు దేనికదే సాటి అనిపించుకుని.. సక్సెస్ సాధించాయి. చిరంజీవి, ఖైదీ నెంబర్ 150, శతమానంభవతి సినిమాలు మూడు భారీ కలెక్షన్స్ సాధించి సక్సెస్ ఫుల్ సినిమాలుగా నిలిచాయి. అదే తరహాలో చాలా కాలానికి మరోసారి ఈ వారం కూడా మూడు చిత్రాలు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి.   రానా హీరోగా నటించిన నేనే రాజు.. నేనే మంత్రి, బోయపాటి దర్శకత్వంలో వచ్చిన జయ జానకీ నాయక, నితిన్-లై చిత్రాలు కలెక్షన్ల విషయంలో నువ్వా నేనా అన్న రేంజ్‌లో పోటీపడ్డాయి.  అయితే ఈ మూడు చిత్రాలపై మొదటి నుంచి భారీ అంచనాలే వున్నాయి. ఎవరి రేంజ్ లో వాళ్లు ప్రమోషన్స్ కూడా అదరగొట్టారు. నితిన్ ప్రచారంలో కాస్త వెనకబడ్డాడు. మరి దాని ప్రభావం కలెక్షన్స్ పై ఏమైనా పడిందా.. ఈ మూడు చిత్రాల్లో  ఫస్ట్ డే వసూళ్లలో ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చిందో చూద్దామా..!

 

నేనేరాజు నేనేమంత్రి  ఏరియాల వారీ వసూళ్లు:

 నైజాం-1. 22 కోట్లు

ఉత్తరాంధ్ర- 68 లక్షలు 

 సీడెడ్- 65

 ఈస్ట్ గోదావరి-35

కృష్ణ- 28

 గుంటూరు-24

 వెస్ట్- 20

 నెల్లూరు- 10 లక్షలు 

 .............................................................................................

మొత్తం 3 కోట్ల 72 లక్షలు వసూలు చేసినట్లు అంచనా

  .............................................................................................

 

జయజానకీ నాయక  ఏరియాల వారీ వసూళ్లు: 

నైజాం-90 లక్షలు

సీడెడ్- 55 

 గుంటూరు- 49 

 ఉత్తరాంధ్ర- 45

 వెస్ట్- 28 

ఈస్ట్- 24 

 నెల్లూరు- 20 

 కృష్ణ- 16 లక్షలు

.................................................

మొత్తం 3 కోట్ల 27 లక్షలు  

.................................................

 

 

  ‘లై’ ఏరియాల వారీ వసూళ్లు: 

 నైజాం-81 లక్షలు

 సీడెడ్- 42

ఉత్తరాంధ్ర- 32 

 ఈస్ట్- 21

 గుంటూరు-17

 కృష్ణ- 17

వెస్ట్- 11

 నెల్లూరు- 6 లక్షలు

..................................................................

మొత్తం 2 కోట్ల 27 లక్షలు మాత్రమే.

...................................................................