Asianet News TeluguAsianet News Telugu

శ్రీదేవి ఎలా చనిపోయింది.. బోనీ చెప్పిన ప్రకారం..ఇలా

  • దుబయి హోటల్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన శ్రీదేవి
  • శ్రీదేవి మృతిపై పలు రకాల సందేహాలు
  • తాజాగా బోనీ కపూర్ తన ఫ్రెండ్ తో చెప్పిన వివరాల ప్రకారం ఇలా...
boney kapoor tells how sridevi passed away accidentally

అందాల తార శ్రీదేవి మరణించి వారం రోజులు కావోస్తున్నా సినీ వర్గాలు ఇంకా ఆ విషాదం నుంచి బయటపడిన దాఖలాలు కనిపించడం లేదు. శ్రీదేవి ఇక లేరన్న వాస్తవాన్ని జీర్జించుకోలేకపోతున్నారు. తన మేనల్లుడు మొహిత్ మార్వా పెళ్లి కోసం వెళ్లిన శ్రీదేవి దుబాయ్‌లోని ఓ హోటల్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. ఆమె మరణానికి ముందు ఏం జరిగింది అనే అంశంపై తన ఫ్రెండ్‌కు బోని స్వయంగా వెల్లడించిన విషయాలు ఇవే..

 

 నిజానికి బోనికపూర్ వ్యవహారంపై పలు సందేహాలు వచ్చాయి. ఈ క్రమంలో శ్రీదేవి మరణంపై తన క్లోజ్ ఫ్రెండ్ కోమల్ నహతాకు బోనికపూర్ వెల్లడించారు. బోని తనకు వెల్లడించిన విషయాలను కోమల్ నహతా ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు. శ్రీదేవి అంత్యక్రియలకు ముందు బోని తనతో చాలా విషయాలు పంచుకొన్నారని ఓ మీడియా ఏజెన్సీకి నహతా వివరించారు.

 

కోమల్ మెహతాతో బోనీ ఏం చెప్పాడంటే.. “ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం శ్రీదేవితో మాట్లాడాను. పాపా (బోనిని ముద్దుగా పిలుస్తుంది) ఐయామ్ మిస్సింగ్ యూ అని చెప్పింది. నేను కూడా మిస్ అవుతున్నానని చెప్పాను. అప్పుడే దుబాయ్‌కి వెళ్లాలని అనుకొన్నాను. కానీ ఆమెతో నేను వస్తున్నట్టు చెప్పలేదు. శ్రీదేవి వద్దకు వెళ్లాలని అనుకొనగానే జాహ్నవి కూడా వెళ్లమని చెప్పింది. మమ్మి ఒంటరిగా ఉంటే భయపడుతుంది. ఒంటరిగా ఉంటే తన పాస్ట్‌పోర్ట్‌, ఇతర కీలక డాక్యుమెంట్లను ఎక్కడన్నా మిస్ చేసుకునే అవకాశం ఉందని జాహ్నవి చెప్పింది.

 

ఖుషీతో ముంబైకి వచ్చిన తర్వాత శ్రీదేవి దుబాయ్‌లో ఒంటరిగా ఉండిపోయింది. తాను ఒంటరిగా ఉన్నానని ఫీలవుతున్నానని నాతో చెప్పింది. దాంతో శ్రీదేవికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని చెప్పాపెట్టకుండా దుబాయ్‌కు వెళ్లాను. శ్రీదేవి దగ్గరకి వెళ్లడానికి ఫిబ్రవరి 24వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటలకు దుబాయ్ ఫ్లైట్‌కి టికెట్లు బుక్ చేశాను. దుబాయ్ కాలమానం ప్రకారం 6.20 గంటలకు అక్కడికి చేరుకొన్నానని బోని తనకు చెప్పారని నహతా వెల్లడించారు.

 

జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌లో (రూమ్ నంబర్ 2201 గదిలో ఉన్న) ఆమెను కలిసి సర్ ప్రైజ్ ఇచ్చాను. శ్రీదేవి ఉన్న హోటల్ గదికి వెళ్లి ఆమెను కలువగానే నన్ను చూసి షాక్ గురైంది. వెంటనే కౌగిలించుకొని, ముద్దులు పెట్టుకొంది. 15 నిమిషాలు మాట్లాడుకొన్నాం. డిన్నర్ వెళ్లేందుకు తయారు కావాలని నేను చెప్పాను. దాంతో ఆమె బాత్రూంలోకి వెళ్లింది. నేను అప్పుడు లివింగ్ రూమ్‌లోకి వెళ్లాను. కొన్ని ఛానెళ్లు అటూ ఇటూ మార్చాను. దక్షిణాఫ్రికా, ఇండియా మ్యాచ్ వస్తుంటే కాసేపు చూశాను. ఆ తర్వాత కాసేపు పాకిస్థాన్ సూపర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ హైలెట్స్ చూశాను. అప్పటికే 20 నిమిషాలు గడిచిపోయింది. 8 గంటలు కావొస్తున్నా శ్రీదేవి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చింది. బాత్రూమ్‌లో అలికిడి లేకపోవడంతో లివింగ్ రూమ్ నుంచే జానూ జానూ అని గట్టిగా కేకలు వేశాను. చాలా సమయమైనా బయటకు రాకపోవడం, బాత్రూమ్‌లో అలికిడి లేకపోవడంతో అనుమానం వచ్చింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో జానూ.. జానూ అని గట్టిగా అరిచాను. టీవీ వాల్యూమ్ కూడా తగ్గించాను. లోపలనుంచి సమాధానం రాకపోవడంతో నాలో అసహనం పెరిగింది. వెంటనే బెడ్ రూంలోకి వెళ్లి తలుపుతట్టాను. అయినా సమాధానం లేదు. శ్రీదేవి స్పందించకపోవడంతో భయాందోళనకు గురయ్యాను. వెంటనే బాత్రూమ్ డోర్ తీశాను. టబ్‌ పూర్తిగా నీళ్లు నిండిపోయాయి. అందులో శ్రీదేవి దేహం పూర్తిగా మునిగి ఉంది. దాంతో నాకు ఏమి చేయాలో తోచలేదు. నా స్నేహితుడికి కాల్ చేశాను. అని బోని చెప్పారని నహతా పేర్కొన్నారు.

 

శ్రీదేవి కోసం కేకలు వేసినా ఫలితం లేకపోవడంతో బ్రాత్రూం వద్దకు వెళ్లాను. లోపలి నుంచి గడియపెట్టుకోకపోవడంతో తలుపు తెరిచి చూశాను. బాత్‌టబ్‌లో విగతజీవిగా పడి ఉండటంతో షాక్ కు గురయ్యాను. అయితే నేలపైన ఒక్క చుక్క కూడా పడకుండా శ్రీదేవి బాత్‌ టబ్ లో మునిగి చనిపోవడం ఎలా జరిగిందని ఆందోళనకు గురయ్యానని బోనీ తెలిపారు.

 

శ్రీదేవికి ఇలా అప్పుడప్పుడు బోని సర్‌ప్రైజ్ ఇస్తుంటాడు. 1994లో బెంగళూరులో శ్రీదేవి ఉంటే వెళ్లి ఆశ్చర్యానికి గురిచేశాడనే విషయాన్ని నహతా గుర్తు చేశారు. వారి 24 ఏళ్ల దాంపత్య జీవితంలో రెండుసార్లు మాత్రమే బోనిని విడిచి శ్రీదేవి దూరంగా ఉంది. ఒకసారి న్యూజెర్సీకి వెళ్లిన సమయంలో, మరోసారి వాంకోవర్‌ వెళ్లినప్పుడు అని నహతా పేర్కొన్నారు.

 

అయితే శ్రీదేవి బాత్రూం టబ్‌లోకి వెళ్లినప్పుడు స్పృహ కోల్పోయి ఉంటుంది. మునిగిపోయినప్పుడు కాళ్లు, చేతులు కొట్టుకొని ఉండి ఉండాలి. ఒకవేళ అది జరిగితే కొన్ని నీళ్లు కింద పడే అవకాశం ఉంది. కానీ అది జరుగలేదు. శ్రీదేవి మరణం ఎలా జరిగిందో ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది అని కోమల్ నహతా అభిప్రాయపడింది.

Follow Us:
Download App:
  • android
  • ios