బాలీవుడ్ నిర్మాత, దివంగత శ్రీదేవి భర్త బోణీకపూర్.. నటి ప్రియా ప్రకాష్ వారియర్ కి లీగల్ నోటీలు పంపించారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ సినిమా 'శ్రీదేవి బంగ్లా' టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ప్రశాంత్ మాంబుల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా శ్రీదేవి జీవితాధారంగా రూపొందించిన సినిమానా అనే సందేహాలు కలుగుతున్నాయి.  టీజర్ ఆఖరిలో శ్రీదేవి బాత్ టబ్ లో పడి చనిపోయిన సన్నివేశాన్ని చూపించడం, సినిమాలో హీరోయిన్ టాప్ హీరోయిన్ శ్రీదేవి పాత్రలో నటించడంతో చాలా మంది ఇది శ్రీదేవి జీవితానికి సంబంధించిన సినిమా అని అనుకుంటున్నారు.

ఈ క్రమంలో బోణీ కపూర్.. దర్శకుడు ప్రశాంత్ మాంబుల్లికి, అలానే హీరోయిన్ ప్రియా ప్రకాష్ కి నోటీసులు పంపించారు. ఈ విషయంపై స్పందించిన దర్శకుడు ప్రశాంత్.. ఈ నోటీసులను ఎదుర్కొంటామని, శ్రీదేవి అన్నది సాధారణంగా అమ్మాయిలు పెట్టుకునే పేరు అని అంటున్నారు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ కథ అని, ఏదేమైనా కేసుని ధైర్యంగా ఎదుర్కొంటామని అన్నారు.

ప్రియా ప్రకాష్ కూడా మీడియాతో ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ''ఇది శ్రీదేవి సినిమానా కాదా అని తెలుసుకోవాలంటే ముందు సినిమా చూడాలి. ఇందులో నేను శ్రీదేవి అనే సూపర్ స్టార్ పాత్రలోనటిస్తున్నాను'' అంటూ వెల్లడించింది. 

ప్రియా ప్రకాష్.. 'శ్రీదేవి బంగ్లా' టీజర్!