సీనియర్ హీరోయిన్ మరియు పొలిటీషియన్ జయాబచ్చన్ వ్యాఖ్యలకు బాలీవుడ్ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. డ్రగ్స్ ఆరోపణలపై మొత్తం బాలీవుడ్ ని నిందించడం సరికాదని వారు ఆరోపిస్తున్నారు. బీజేపీ ఎంపీ మరియు నటుడు రవి కిషన్ సోమవారం నాడు పార్లమెంట్ లో డ్రగ్స్ వ్యవహారం లేవనెత్తారు. బాలీవుడ్ లో డ్రగ్ కల్చర్ అధికంగా ఉందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు. ఇప్పటికే కొందరు నేరస్థులను అరెస్ట్ చేయడం అభినందించదగ్గ విషయం, మిగతా నేరస్థులను కూడా శిక్షించాలని ఆయన కోరడం జరిగింది. 

ఈ వ్యాఖ్యలపై జయాబచ్చన్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. కొంతమంది కారణంగా మొత్తం బాలీవుడ్ పై డ్రగ్స్ ఆరోపణలు చేయడం సరికాదని ఆమె అన్నారు. దేశం ఆర్థికంగా వెనుకబడిపోగా, ఆ విషయాలను నుండి ప్రజల ద్రుష్టి మరల్చడానికి ఈ డ్రగ్స్ వ్యవహారం తెరపైకి తెస్తున్నారు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజలను డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రభుత్వ కుట్రగా జయాబచ్చన్ ఈ వ్యవహారాన్ని చూశారు. 

కాగా ఈ విషయంలో జయాబచ్చన్ బాలీవుడ్ ఆమెకు మద్దతుగా నిలిచింది. దర్శకుడు అనుభవ్ సిన్హా, తాప్సి పన్ను జయాబచ్చన్ వ్యాఖ్యలను సమర్ధించారు. సోషల్ మీడియా ద్వారా వారు జయా బచ్చన్ కి మద్దతు ప్రకటించారు. ఇక సుశాంత్ సూసైడ్ కేసుగా మొదలైన విచారణ డ్రగ్స్ కోణం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె తమ్ముడు షోవిక్ చక్రవర్తి మరికొందరు డ్రగ్ పెడ్లర్స్ అరెస్ట్ కావడం జరిగింది.