నెట్టింట్లో ఆ హీరోయిన్ల ఇల్లీగల్ ఎఫైర్స్!

bollywood lust stories trailer
Highlights

సినిమాలలో అడల్ట్ కంటెంట్ చూపిస్తుంటే సెన్సార్ సమస్య వస్తుందని 

సినిమాలలో అడల్ట్ కంటెంట్ చూపిస్తుంటే సెన్సార్ సమస్య వస్తుందని ఈ మధ్య కాలంలో దర్శకులు తము చెప్పాలనుకున్న విషయాల కోసం యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'లస్ట్ స్టోరీస్' అంటూ ఓ నెట్ సిరీస్ ను తీస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ నెట్ ఫ్లిక్స్ దీన్ని ప్రెజంట్ చేస్తోంది. నలుగు టాప్ హీరోయిన్లను పెట్టి నలుగురు దర్శకులు ఈ నెట్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.

రాధికా ఆప్టే, భూమి పడ్నేకర్, మనీషా కోయిరాలా, కియారా అద్వానీ వంటి హీరోయిన్లు ఈ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ సిరీస్ లో ఒక్కో హీరోయిన్ ఇల్లీగల ఎఫైర్స్ నడిపిస్తుంటాడు. పెళ్లై భర్త ఉన్నా.. తన స్టూడెంట్ తో సంబంధం పెట్టుకున్న మహిళగా రాధికా ఆప్టే, మనసులో ఒకరిని పెట్టుకొని తన భర్తతో కాపురం చేసే మహిళగా కియారా ఆద్వానీ కనిపించనుంది. తన ఇంటి యజమాని కొడుకుతో ఎఫైర్ నడిపించే పాత్రలో భూమి పడ్నేకర్, భర్త స్నేహితుడిని ఇష్టపడే పాత్రలో మనీషా కోయిరాలా కనిపించనున్నారు.

ఈ మొత్తం నాలుగు కథలను కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ వంటి టాప్ డైరెక్టర్లు తెరకెక్కిస్తున్నారు. జూన్ 15 నుండి నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ను చూడొచ్చు! 

 

 

loader