Asianet News TeluguAsianet News Telugu

మహేష్ బాబును మించి సాధించిన లేడీ సింగర్..? ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..?

ఓ హిందీ సింగర్.. సూపర్ స్టార్ మహేష్ బాబుకే షాక్ ఇచ్చింది. ఆయనన్ను మించి సాధించింది.. స్టార్లు.. సూపర్ స్టార్లకు ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? 
 

Bollywood lady singer Palak Muchhal who follows superstar Mahesh Babu in community service JmS
Author
First Published Jul 20, 2024, 1:31 PM IST | Last Updated Jul 20, 2024, 1:31 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు.. పాలిటిక్స్ లో కూడా కోట్లకు కోట్లు సంపాదించి లగ్జరీ లైఫ్ ను కొనసాగిస్తుంటారు. అయితే అందులో కొంత మంది మాత్రం తమకు స్టార్ డమ్ ఇచ్చింది జనాలే కాబట్టి.. వారికి ఎంతో కొంత చేయాలి అన్న సంకల్పంతో.. సమాజసేవ కూడా చేస్తుంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా  ఒకరు. ఆయన ఇప్పటి వరకూ దాదాపు 1200 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయించి ప్రాణం పోశారు. వారి పాలిట దేవుడిగా మారాడు. 

అయితే వెయ్యి ఆపరేషన్లు అయ్యేంత వరకూ మహేష్ బాబు చేసిన పని బయటకు రాలేదు. ఈమధ్యే సూపర్ స్టార్ ఇలా చేస్తున్నాడన్న సంగతి తెలిసింది. అయితే  ఇలా చిన్నారులు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా.. తనవద్దకు వెళ్తే.. సహాయం చేస్తానన్నారు మహేష్. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబును మించిపోయింది ఓ సింగర్. మహేష్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఆపరేషన్లు చేయించి రికార్డ్ సృష్టించింది. 

All So Read ; రామ్ చరణ్ ను కాదని అల్లు అర్జున్ కు హిట్ సినిమా కథను ఇచ్చిన చిరంజీవి.. కారణం ఇదే..?

 మహేష్ లాగే ఓ బాలీవుడ్ సింగర్ కూడా హార్ట్ సమస్యలు ఉన్న చిన్న పిల్లలకు తన డబ్బులతో ఆపరేషన్స్ చేయిస్తుంది. బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ ఎన్నో సినిమాల్లో తన పాటలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రైవేట్ మ్యూజిక్ కాన్సర్ట్స్ కూడా నిర్వహిస్తుంటుంది. అయితే పాలక్ ముచ్చల్ తన యంగ్ ఏజ్ నుంచే ఈ పని చేస్తుంది. తను సంపాదించిన దాంట్లో చాలా భాగం పిల్లల ఆపరేషన్స్ కి ఖర్చుపెడుతుంది. 

 

ఇప్పటి వరకు పాలక్ ముచ్చల్ ఏకంగా 3000 మంది చిన్నారులకు  ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. పాలక్  స్వతహాగా  డాక్టర్ కావడంతో.. ఆమెకు ప్రాణం విలువ, వైధ్య అందకపోతే ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అనేది ప్రత్యక్షంగా తెలుసు. అంతే కాదు ఆమె డాక్టర్ అయ్యిండి పాటలు పాడటానికి పిల్లలే కారణం. ఆమె పేద పిల్లలను  కాపాడటానికే పాటలు పాడుతున్నాను అని అన్నారు. 

All So Read: ఎక్కువ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లు సాధించిన సౌత్ ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు..?

రీసెంట్ గానే  3000  ఆపరేషన్స్ మార్క్ ను క్రాస్ చేసింది ముచ్చల్. ఈ సందర్భంగా ఆమెకు హాస్పిటల్ వాళ్ళు సన్మానం కూడా చేశారు.  ఈ క్రమంలోనే పాలక్ ముచ్చల్ బంగారంలాంటిమాటలు మాట్లాడారు  మీడియాతో. ఆహె మాట్లాడుతూ.. నా పాటలు హిట్ అయితే నాకు పేరు వస్తుంది. నాకు వచ్చిన పేరు, డబ్బు ఇందు కోసమే వినియోగిస్తాను. నేను ఒక్క మ్యూజిక్ కాన్సర్ట్ చేస్తే దాంతో వచ్చిన డబ్బుతో దాదాపు 14 మంది ఆపరేషన్స్ కి సరిపోతుంది. అందుకే ఈ పని చేస్తున్నాను అన్నారు. 

All So Read: భార్యను వదిలేద్దామనుకున్నా పూరీ జగన్నాథ్.. లావణ్య గురించి ఆ నిజం తెలియడంతో షాక్ అయ్యాడట.

అంతే కాదు ఇంకా నా దగ్గర ఉన్న లిస్ట్ లో 400 మందికి పైగా ఆపరేషన్స్ జరగాల్సి ఉంది. వారికి కూడా ఎలాగైన ఆపరేషన్ చేయిస్తాను అన్నారు ముచ్చల్. వారి కోసం ఆమె నిరంతరం కష్టపడుతున్నారు. ఆపరేషన్స్ కు నిధులు సమకూర్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చిన్నారుల ప్రాణాలు కాపాడటంతో ఉన్నంత ఆనందం.. డబ్బు సంపాదించుకుని దాచుకుంటే రాదు అన్నారు ముచ్చల్. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios