ఎల్బీనగర్ షూటింగ్ లో ప్రమాదం.. బాలీవుడ్ స్టార్ రోహిత్ శెట్టికి తీవ్ర గాయాలు..? హాస్పిటల్ కు తరలింపు
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ స్టంట్ మాస్టర్ రోహిత్ శెట్టి కి హైదరాబాద్ లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్ కు తరలించినట్టు సమాచారం.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ప్రమాదం బారిన పడ్డారు. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో షూటింగ్ చేుస్తుడగా యాక్సిడెంట్ జరిగి.. డైరెక్టర్ రోహిత్ శెట్టికి తీవ్ర గాయలు అయినట్టు తెలుస్తోంది. గాయాలపాలు అయిన ఆయన్ను ఎల్బీనగర్ లోని కామినేని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పటి వరకూ ఎలాంటి ఇన్ఫార్మేషన్ రాలేదు.
ఈ ప్రమాదానికి సంబంధించి కూడా టీమ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే గత రెండు రోజులుగా హైదరాబాద్ లో బాలీవుడ్ వెబ్ సిరీస్ కు సబందించి షూటింగ్ జరుగుతుంది. సిద్థార్ధ్ మల్హోత్ర హీరోగా..రోహిత్ శెట్టి డైరెక్షన్ లో ఈ వెబ్ మూవీ తెరకెక్కుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో సిద్ధార్థ్ మల్హోత్రా ఎస్పీ కబీర్ మాలిక్ పాత్రలో నటిస్తుండగా శిల్పా శెట్టి ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే వివేక్ ఓబెరాయ్ ఈ సిరీస్ లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇషా తల్వార్, విభూతి తల్వార్, నికితిన్ ధీర్, శ్వేతా తివారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ఈనెల 5 నుంచి హైదరాబాద్ లో మకాం వేశారు టీమ్. ఈక్రమంలోనే ఎల్బీ నగర్ వద్ద షూటింగ్ చేస్తుండగా ఈప్రమాదం జరిగినట్టు సమాచారం అందింది.
ఈ ప్రమాదం గురించి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. రోహిత్ శెట్టి దర్శకులు మరియు స్టంట్ మాస్టర్ కూడా. ఈక్రమంలోనే... ఓ కార్ చేజింగ్ సీన్ ను తెరకెక్కిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాని అఫీషియల్ గా మాత్రం ఈ విషయంలో ఎటువంటిప్రకటనా రాలేదు. రోహిత్ శెట్టికి పెద్ద గాయాలు కాలేదని కొందరు.. తీవ్ర గాయాలు అయ్యాయని కొందరు రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. మరి నిజం ఏంటో తెలియాలంటే అధికారిక ప్రకటన తరువాతే తెలుస్తుంది.