ఫ్యాన్స్ ను ఆశపెట్టి.. 2023 లో వెండితెరకు హ్యాండ్ ఇచ్చిన టాలీవుడ్ హీరోలు
2023 కు గుడ్ బై చెప్పే టైమ్ వచ్చేసింది. కొత్త ఏడాది. సరికొత్త ఆశలతో అడుగు పెట్టడానికి అందరూ సిద్దం అయ్యి ఉన్నారు. ఈక్రమంలో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా 2023 పై గంపెడు ఆశలు పెట్టుకుంది. ఇక ఈ ఏడాది ఫ్యాన్స్ ను నిరాశపరిచిన హీరోలు ఎవరు..? బిగ్ స్క్రీన్ పై కనిపించ కుండా దాగుడుమూతలుఆడిన హీరోలో ఎవరో చూద్దాం.

2023 చాలా మంది టాలీవుడ్ హీరోలకు కలిసి వచ్చింది. మంచి హిట్లు కొట్టారు. కాని కొంత మంది స్టార్స్ మాత్రం ఫ్యాన్స్ కు హ్యాండ్ ఇచ్చారు. కాని నెక్ట్స్ ఇయర్ మాత్రం పుల్ మీల్స్ పెడతామంటున్నారు. ఎన్నో ఆశలతో తమ అభిమాన తారలను వెండితెరపై చూడాలి అనుకున్న ఫ్యాన్స్ కు ఈ ఏడాది నిరాశే ఎదురయ్యింది. ఈక్రమంలో ఈఏడాది ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, లాంటి స్టార్స్ సినిమాలు థియేటర్లను పలుకరించలేదు. ఇక ఈ ఏడాది కనిపించని టాలీవుడ్ స్టార్స్ ఇంకెవరంటే..?
టాలీవుడ్ లో.. ఈ ఏడాది కనిపించని తారలలో ముందుగా చెప్పుకోవల్సింది ఆర్ఆర్ఆర్ కాంబినేషన్ హీరోల గురించే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ ఇద్దరు తారలు ఈ ఏడాది తమ ఫ్యాన్స్ కు హ్యాండ్ ఇచ్చారు. ముఖ్యంగా రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ హడావిడి నడుస్తుండగానే సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈసినిమా కు ఎక్కువగా బ్రేక్ లు రావడంతో డిలై అయ్యింది. ఏడాది రిలీజ్ అవ్వాల్సిన సినిమా నెక్ట్స్ ఇయర్ సమ్మర్ కు మారింది. రామ్ చరణ్, ఉపాసన కు గారాల కూతురు పుట్టడం, శంకర్ కు ఇండియన్ 2 షూటింగ్ ప్రెజర్ పెరగడంతో.. ఈమూవీ షూటింగ్ డిలై అయ్యింది. ఇంకా 50 రోజుల వరకూ షూటింగ్ పెండింగ్ ఉందట. ఇక త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ కూడా ఈ ఏడాది తన ఫ్యాన్స్ ను నిరాశపరిచాడు. ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ ఇమేజ్ రావడంతో.. చాలా జాగ్రత్తగా తన నెక్ట్స్ సినిమాను ప్లాన్ చేశాడు. కొరటాల శివతో ముందు నుంచే అనుకున్న సినిమాను ఇంకాస్త మెరుగుపరిచి.. పాన్ ఇండియా మూవీగా మార్చి.. కాస్త లేట్ గా సినిమాను స్టార్ట్ చేశారు. దేవర టైటిల్ తో రూపొందుతున్న ఈమూవీ నెక్ట్స్ ఇయర్ మిడ్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. ఫుల్లీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈసినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈమూవీ ద్వారా ఆమె సౌత్ ఎంట్రీ ఇస్తోంది.
ఇక ఈ ఏడాది బిగ్ స్క్రీన్ పై కనిపించని హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నారు. అసలే మహేష్ బాబు ఏడాదికో సినిమా చేస్తుంటాడు. ఇక ఆచేసే ఒక్క సినిమా అయినా.. ఏదైనా తేడా వచ్చి బ్రేక్ వచ్చిందంటే.. ఇక ఆ ఏడాది అది లేనట్టే..? ఈక్రమంలో మహేష్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా స్టార్ట్ చేశాడు.. గుంటూరు కారం టైటిల్ తో రూపొందుతున్న ఈసినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి.. దాదాపు ఓ 10 బ్రేక్ లు తీసుకున్నారు. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా బ్రేక్స్ వేస్తూ.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరి ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాని సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం 2023 లో మహేష్ కనిపించనందకు చాలా ఫీల్ అవుతున్నారు.
ఇక పుష్ప సినిమాతో టాలీవుడ్ తో పాటు, బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ సాధించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అంతకు మించి పుష్ప2ను తెరకెక్కించబోతున్నారు. ఆస్కార్ టార్గెట్ గా సినిమాను పక్కా ప్రణాళికతో చేస్తున్నాడు. ఈక్రమంలో బన్నీ ఈ ఏడాది ఫ్యాన్స్ కు దూరం అవ్వాల్సి వచ్చింది. పుష్ప సినిమాతో జాతీయ అవార్డ్ సాధించాడు బన్నీ.. ఇక పుష్ప2తో అంతకు మించి సాధించాలన్న పట్టుదలతో ఉండటంతో.. ఫ్యాన్స్ నిరాశపడ్డా..నెక్ట్స్ ఇయర్ జాతర చేయడానికి రెడీ అవుతున్నాడు.
Actor Nagarjuna
ఇక సీనియర్ హీరోలు కూడా కొంత మంది ఈ ఏడాది స్క్రీన్ పై కనిపించలేదు. మెగాస్టార్, బాలయ్య.. రవితేజ లాంటి వారు స్క్రీన్ ను ఊపు ఊపి పడేశారు. కాని నాగార్జున, వెంకటేష్ మాత్రం అసలు ఈ ఏడాది కనిపించలేదు. నాగార్జున వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే పక్కాగా ప్లాన్ చేసుకుని.. నెక్ట్స్ ఇయర్ నా సామిరంగా సినిమాతో సందడి చేయబోతున్నాడు.
ఇక వెంకటేష్ మాత్రం వరుస విజయాలు నమోదు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఎందుకో తెలియదు 2023కి గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన డిఫరెంట్ జానర్ ను ట్రై చేస్తున్నాడే. సైందవ సినిమాతో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. ఈహూవీ నెక్ట్ ఇయర్ సంక్రాంతి బరిలో ఉండే అవకాశం ఉంది. ఇలా చాలా మంది టాలీవుడ్ స్టార్స్ ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. నెక్ట్ ఇయర్ మాత్రం ఫ్యాన్స్ కు అదరిపోయే ట్రీట్ ను రెడీ చేస్తున్నారు.