భారీ అంచనాల నడుమ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్ కి మూడు వరుస పరాజయాలు తప్పలేదు. ఫ్లాప్స్ లో ఉన్న అఖిల్ కోసం కనుమరుగైన బొమ్మరిల్లు భాస్కర్ ని తీసుకురావడం అక్కినేని ఫ్యాన్స్ కి ఆశ్చర్యాన్ని కలిగించింది.
భారీ అంచనాల నడుమ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్ కి మూడు వరుస పరాజయాలు తప్పలేదు. ఫ్లాప్స్ లో ఉన్న అఖిల్ కోసం కనుమరుగైన బొమ్మరిల్లు భాస్కర్ ని తీసుకురావడం అక్కినేని ఫ్యాన్స్ కి ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఎన్నో ఏళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైన బొమ్మరిల్లు భాస్కరే అఖిల్ కు మంచి హిట్ ఇచ్చాడు.
ఇటీవల విడుదలైన Most Eligible Bachelor చిత్రం మంచి వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. Akhil Akkineni, Pooja Hegde కెమిస్ట్రీకి యువత ఫిదా అవుతున్నారు. దీనితో మరోసారి బొమ్మరిల్లు భాస్కర్ బౌన్స్ బ్యాక్ అయ్యారు. కెరీర్ ఆరంభంలో బొమ్మరిల్లు, పరుగు లాంటి సూపర్ హిట్స్ అందించిన భాస్కర్ ని ఆరెంజ్ మూవీ బాగా దెబ్బ తీసింది. ఆ తర్వాత తెరకెక్కించిన ఒంగోలు గిత్త కూడా తీవ్రంగా నిరాశ పరచడంతో ఈ దర్శకుడు కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రూపంలో వచ్చిన అవకాశాన్ని Bommarillu Bhaskar చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.
తనలో ఇంకా దర్శకత్వ నైపుణ్యం అలాగే ఉందని నిరూపించాడు. దీనితో మరోసారి భాస్కర్ కెరీర్ జోరందుకునట్లు కనిపిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ నెక్స్ట్ మూవీ కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉండబోతోందట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ కావడంతో అల్లు అరవింద్.. భాస్కర్ తో మరో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఘనంగా మణిశర్మ తనయుడి వివాహం.. జంట అంటే ఇలా ఉండాలి అనిపించేలా, ఫోటోస్ వైరల్
ఓ మెగా హీరోతో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భాస్కర్ నెక్స్ట్ మూవీ ఉండబోతోందని టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని వినికిడి. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయ్యాక ఆ మెగా హీరో ఎవరనేది తెలుస్తుంది. అలాగే 'ఆహా' ఓటిటి కోసం కూడా బొమ్మరిల్లు భాస్కర్ ఓ చిత్రానికి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.
దసరా కానుకగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.
