బిగ్ బాస్ షో గురువారం నాడు ఎపిసోడ్ లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ పెద్ద రచ్చ లేపింది. ఈ వారం లగ్జరీ బడ్జెట్ లో భాగంగా 'ఛాయిస్ యువర్స్' అంటూ హేమ, జాఫర్ లను టాస్క్ కోసం ఎంపిక చేసుకున్నారు కంటెస్టంట్స్. ఈ ఇద్దరూ గేమ్ లో సక్సెస్ కావడంతో ఈ వారం లగ్జరీ బడ్జెట్ సాధించారు. అయితే లగ్జరీ బడ్జెట్ ని ఉపయోగించిన వారానికి సరిపడా సరుకులను \కొనడంతో విఫలం అయ్యారు కంటెస్టంట్స్. 

అయితే దీనికి కారణం శ్రీముఖి టైంకి లేకపోవడమే అని హేమ అనడంతో ఫైర్ అయింది శ్రీముఖి. దీంతో శ్రీముఖి రెచ్చిపోయింది. తన తప్పు లేదని టైంకి వచ్చానని కానీ ఆ టైంకి టీవీ ఆన్ చేయకపోవడంతో లేట్ అయిందని.. టీవీ రిమోట్ మహేష్ దగ్గర ఉందని.. తను ఆన్ చేయకపోతే నువ్ నన్ను అంటావ్ ఏంటి..? అంటూ హేమపై ఫైర్ అయిందిశ్రీముఖి. ఓ పక్క ఈ గొడవ జరుగుతుంటే మరోపక్క మహేష్ విట్ట,

వరుణ్ సందేశ్ మధ్య గొడవ మొదలైంది. వరుణ్ భార్య వితికా తనను మహేష్ విట్టా లోపాలకి పో అన్నాడంటూ వితికా గట్టిగా అరవడంతో సీన్ లోకి దిగిన వరుణ్ ఫైర్ అయ్యాడు. ''ఏయ్.. నా పెళ్లాన్ని పో అంటావా..? సిగ్గులేనోడా..?''అంటూ మహేష్ ని కొట్టేందుకు మీదకి వెళ్తూ ఆగ్రహంతో ఊగిపోయాడు. మహేష్ సమాధానం చెప్పడానికి ట్రై చేస్తుండగా.. వరుణ్ వినకపోవడంతో అతడు కూడా సీరియస్ అయిపోయాడు.

దీంతో ఇద్దరూ రారా అంటే రారా అని కొట్టుకోవడానికి రెడీ అయిపోయారు. దీంతో మిగిలిన కంటెస్టంట్స్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. వితికా సైతం మహేష్ పై ఫైర్ అయింది. వివాదం కంటిన్యూ అవుతుండగా.. ఎపిసోడ్ ముగిసింది. 

బిగ్ బాస్ 3: ఈ చపాతీ రచ్చేంటి పునర్నవి..?