బిగ్ బాస్ సీజన్ 3 మొదలైన సంగతి తెలిసిందే. తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్ లో ఆరుగురు కంటెస్టంట్స్ ఉండడంతో ఇంటరెస్టింగ్ గా మొదలైంది. గురువారం నాడు బిగ్ బాస్ షో ప్రారంభంలోనే హేమ, రాహుల్ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మిగిలిన కంటెస్టంట్స్ ప్రయత్నించగా ఇద్దరూ తగ్గేదే లేదు అంటూ ప్రవర్తించారు. 

నాగార్జున వస్తారు కదా అప్పుడు తేల్చుకుందాం అంటూ హేమ అనడంతో పక్కనే ఉన్న మహేష్ విట్టా కల్పించుకొని ఆయన లెవెల్ ఏంటి..? మన ఈ పత్తి యాపారం ఏంటి..? అని తన కామెడీ టైమింగ్ తో హేమకి షాకిచ్చాడు. మరోపక్క పునర్నవి భూపాలం తన చపాతి ముక్క సగం తినేశారు అంటూ సిల్లీ చర్చకు తెరతీసింది. అలీ రజా తన చపాతి  తినేశాడంటూ రచ్చ చేసింది.

కంటెస్టంట్స్ మొత్తం అలీ రాజాని చపాతి తినేశావా..? అని అడగడం ప్రేక్షకులకు కాస్త విసుగు తెప్పించింది. ఇక హేమ వచ్చి.. నువ్ చపాతీ తినేశావని అందరూ అనుకుంటున్నారని అలీ రాజాకి చెప్పడంతో.. నేను ఎక్కడ తిన్నా.. తిన్నది బాబా భాస్కర్ అని చెప్పాడు అలీ.

బాబా భాస్కర్ వచ్చి కర్రీ బాగుందని రెండు చపాతీలు తిన్నా అని తనదైన శైలిలో కామెడీ చేయడంతో గొడవకు కారణమైన పునర్నవి అయ్యో మీరు తిన్నారా..? అనవసరంగా నేను అలీని అనేశానే అని మిగిలిన చపాతీ తినేసింది.