గత ఆదివారం నాడు మొదలైన బిగ్ బాస్ సీజన్ 3 ఐదు ఎపిసోడ్ లను పూర్తి చేసుకొని ఆరో ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఈ వారం ఎలిమినేషన్ లో ఆరుగురు కంటెస్టంట్స్ రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమలు ఉండడంతో షో మరింత ఆసక్తిగా మారింది. తాజాగా ఓ ఎపిసోడ్ లో వరుణ్ తేజ్, మహేష్ విట్టాల మధ్య గొడవ జరిగిన సంగతి 
తెలిసిందే.

తన భార్య వితికాను మహేష్ పో అన్నాడని వరుణ్ ఫైర్ అయ్యాడు. వితికా కూడా మహేష్ పై కేకలు వేయడంతో వివాదం చెలరేగింది. ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్ లో అదే గొడవ కంటిన్యూ అయింది. తను వితికాను చెల్లెలుగా భావించే చనువు తీసుకొని పో.. అన్నానే తప్ప మరో ఉద్దేశం లేదని హౌస్ మేట్స్ కి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు మహేష్ విట్టా. అయితే వరుణ్, వితికలు క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టగా.. శ్రీముఖి సైతం వాళ్లకే సపోర్ట్ గా నిలిచింది. 

చాలా వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకున్న మహేష్.. తనది సీమ కావడం వల్ల యాస అలానే వస్తుందని.. పో అనే మాట కారణంగా బాధ పడి ఉంటే.. తన తప్పు లేకపోయినా క్షమాపణలు చెప్తానని మహేష్ చెప్పగా.. దానికి వితికా అలాంటి సారీ తనకు వద్దంటూ మరోసారి గొడవకి దిగింది. నేను ఇంత తగ్గి చెప్తున్నా.. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మహేష్ కేకలు వేయడంతో వరుణ్ సందేశ్ చెలరేగిపోయాడు. చివరకు మహేష్ వరుణ్ కి క్షమాపణలు చెప్పడంతో అక్కడితో గొడవ సద్దుమణిగింది. 

కానీ మహేష్ క్షమాపణలు చెప్తున్న సమయంలో వరుణ్ సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు సరికదా.. తనను బ్రో అని పిలవద్దంటూ మహేష్ కి తన ఆటిట్యూడ్ చూపించాడు. ఇక కాసేపటికి బిగ్ బాస్.. హౌస్ మేట్స్ కి 'కళాకారులం.. మేం కళాకారులం' అనే స్కిట్  ఇచ్చారు. ఈ స్కిట్ లో భాగంగా రెండు టీమ్ లుగా విడిపోయిన కంటెస్టంట్స్ తమ పెర్ఫార్మన్స్ తో అలరించారు. 
బిగ్ బాస్ 3: ఏయ్.. నా పెళ్లాన్ని పో అంటావా..? మహేష్ పై వరుణ్ ఫైర్!