బిగ్ బాస్2: ప్రతివారం ఇద్దరు ఎలిమినేట్ కానున్నారా..?

bigg boss2: two housemates to eliminate every week
Highlights

వంద రోజుల ఈ షోలో యాభై ఎపిసోడ్లు పూర్తయ్యాయి. మరో యాభై రోజులను ఏడు వారాలుగా డివైడ్ చేద్దాం. ఇప్పటికే హౌస్ లో 12 మంది ఉన్నారు. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేవారితో కలిపి 14 మంది అవుతారు. వారానికి ఇద్దరి చొప్పున ఎలిమినేట్ చేయకుంటే మున్ముందు మరింత కష్టమయ్యే ఛాన్స్ ఉంది

బిగ్ బాస్ సీజన్1 తో పోలిస్తే సీజన్2 ఆసక్తికరంగా సాగుతోంది. ఏదైనా జరగొచ్చు అనే ట్యాగ్ లైన్ కు తగ్గట్లే అన్నీ జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఆల్రెడీ ఎలిమినేట్ అయిన ఇద్దరు హౌస్ మేట్స్ ను తిరిగి హౌస్ లోకి పంపబోతున్నారు. వీరి ఎంట్రీ ఎలిమినేషన్ పై ఆసక్తి పెంచేలా చేస్తుంది. ఎందుకంటే ఇద్దరూ ఎంట్రీ ఇస్తుండడంతో ఇద్దరినీ ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం.

పైగా గత వారం ఎలిమినేషన్ కూడా లేకపోవడంతో పాటు షో పూర్తవ్వడానికి మరో యాభై రోజులు మాత్రమే ఉండటంతో ఒక్కొక్కరిని కాకుండా ఇద్దరు చొప్పున బయటకు పంపడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వంద రోజుల ఈ షోలో యాభై ఎపిసోడ్లు పూర్తయ్యాయి. మరో యాభై రోజులను ఏడు వారాలుగా డివైడ్ చేద్దాం. ఇప్పటికే హౌస్ లో 12 మంది ఉన్నారు. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేవారితో కలిపి 14 మంది అవుతారు.

వారానికి ఇద్దరి చొప్పున ఎలిమినేట్ చేయకుంటే మున్ముందు మరింత కష్టమయ్యే ఛాన్స్ ఉంది. చివరకు ముగ్గురు లేదా నలుగురు మిగిలేలా చేయాలంటే డబుల్ ధమాకా ఎలిమినేషన్ తప్పనిసరి అనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి!

loader