బిగ్ బాస్2: తనీష్ తో సామ్రాట్ గొడవ.. ఒకరినొకరు కొట్టుకునేంతగా

Bigg Boss2 Telugu: Fight between tanish and samrat
Highlights

సామ్రాట్.. తనీష్ తో వాగ్వాదానికి దిగుతాడు. గొడవ కాస్త ముదరడంతో సామ్రాట్.. తనీష్ పై చేయి చేసుకుంటాడు. అతడ్ని సిమ్మింగ్ పూల్ లోకి తోసేస్తాడు

బిగ్ బాస్ హౌస్ లో తనీష్, సామ్రాట్ మంచి స్నేహితులు. ఇప్పటివరకు వారు ఒకరినొకరు మాటలు అనుకున్నది కూడా లేదు. అలాంటిది ఇద్దరూ ఇప్పుడు కొట్టుకునేవరకు వెళ్లారు. సామ్రాట్.. తనీష్ తో గొడవ పెట్టుకొని అతడిని స్విమ్మింగ్ పూల్ లోకి నెట్టేశాడు. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా..? హౌస్ లో ఉన్న సభ్యులకు బిగ్ బాస్ ఒక సినిమా తీయమని మంగళవారం ఎపిసోడ్ లో ఒక టాస్క్ ఇచ్చారు.

అమిత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు రోల్ రైడా కెమెరామెన్ గా పని చేస్తున్నాడు. వారు రాసుకున్న కథలో తనీష్, కౌశల్, సామ్రాట్ మంచి స్నేహితులు. తనీష్, కౌశల్ ఇద్దరూ నందినిని ప్రేమిస్తారు. కానీ నందిని డబ్బు కోసం కౌశల్ ను ప్రేమిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న తనీష్ కౌశల్ కు చెప్పడం దీంతో సామ్రాట్ వారిద్దరి మధ్యలో గొడవ పెడుతున్నావా అంటూ తనీష్ తో వాగ్వాదానికి దిగుతాడు.

గొడవ కాస్త ముదరడంతో సామ్రాట్.. తనీష్ పై చేయి చేసుకుంటాడు. అతడ్ని సిమ్మింగ్ పూల్ లోకి తోసేస్తాడు. దీన్ని ప్రోమోగా విడుదల చేసింది స్టార్ మా యాజమాన్యం. ఈ ప్రోమో ఆసక్తికరంగా అనిపించడంతో ఈరోజు షో మరింత రసవత్తరంగా సాగుతుందనిపిస్తుంది. 

loader