బిగ్ బాస్2: హౌస్ లో ఆ ఇద్దరి ప్రవర్తనతో అంతా షాక్

Bigg Boss2 Telugu: deepthi, ganesh's behaviour changed suddenly
Highlights

ఇప్పటివరకు దీప్తి రెండు సార్లు నామినేట్ అవ్వగా, గణేష్ షో మొదలైన దగ్గర నుండి నామినేట్ అవుతూ వస్తున్నాడు. దీంతో గణేష్.. దీప్తిని నామినేట్ అవ్వమని చెప్పగా దానికి ఆమె నిరాకరించింది. కానీ గణేష్ మాత్రం ఈసారి నామినేట్ అవ్వలేనని తెగేసి చెప్పేశాడు

ఆరవ వారంలోకి ఎంటర్ అయిన బిగ్ బాస్ షో ఈ వారంలో ఎలిమినేషన్ కోసం ఆసక్తికరమైన టాస్క్ ను హౌస్ లో వారికి ఇచ్చారు బిగ్ బాస్. తమకు ఇష్టమైన వారిని ముందుగా జంటగా ఎంచుకోమని చెప్పిన బిగ్ బాస్ వారికి సంకెళ్లు వేశారు. వారిలో ఒకరిని విడుదల చేస్తే వారు సేఫ్ జోన్ లో సంకెళ్లతో ఉన్నవారు ఎలిమినేషన్ కు నేరుగా నామినేట్ అవుతారని బిగ్ బాస్ సూచించారు. ఈ క్రమంలో తేజస్వి.. నందిని కోసం నామినేట్ కాగా, కౌశల్ కోసం సామ్రాట్ నామినేట్ అయ్యాడు.

దీప్తి సునైనాను సేవ్ చేసి తను నామినేట్ అయ్యాడు తనీష్. రోల్ రైడా.. బాబు గోగినేనిని విడిపించి తాను నామినేట్ అయ్యాడు. ఇక్కడ వీరంతా ఒక అండర్ స్టాండింగ్ తో ముందే అనుకొని నామినేట్ అయ్యారు. కానీ ఇదే సీన్ దీప్తి-గణేష్ ల దగ్గరకు వచ్చేసరికి మొత్తం మారిపోయింది. ఇద్దరిలో ఎవరికీ నామినేట్ అవ్వడం ఇష్టం లేదు. ఇప్పటివరకు దీప్తి రెండు సార్లు నామినేట్ అవ్వగా, గణేష్ షో మొదలైన దగ్గర నుండి నామినేట్ అవుతూ వస్తున్నాడు.

దీంతో గణేష్.. దీప్తిని నామినేట్ అవ్వమని చెప్పగా దానికి ఆమె నిరాకరించింది. కానీ గణేష్ మాత్రం ఈసారి నామినేట్ అవ్వలేనని తెగేసి చెప్పేశాడు. అప్పటివరకు ఎంతో ప్రేమగా అక్క-తమ్ముళ్లుగా ఉన్న వారిద్దరిలో ఎలిమినేషన్ రౌండ్ కి వచ్చేసరికి ప్రవర్తన మొత్తం మారిపోయింది. దీప్తి స్వార్ధంగా ఆలోచించడం స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఆమె ఆవేశపడుతూ మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఎపిసోడ్ లో గణేష్ కోపం కూడా బయటపడింది. ఇప్పటివరకు ఆడియన్స్ సింపతీతో ఓట్లు దక్కించుకున్న వీరికి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తో ఓట్లు తగ్గడం ఖాయమనిపిస్తోంది. మరి ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి! 

loader