బిగ్ బాస్2: అమిత్ చేసిన పనికి గణేష్ వెక్కి వెక్కి ఏడ్చాడు

Bigg Boss2 telugu: amith breaks egg on ganesh's head
Highlights

ఈ టాస్క్ లో అమిత్ ఒకరి వంట చెడగొట్టాలి, ఓ కంటెస్టెంట్ నెత్తిపై గుడ్డు కొట్టాలి, దీప్తి సునయనను ఏడిపించాలి, ఓ కంటె స్టెంట్ ప్యాంట్, షర్ట్ , షూస్ స్విమ్మింగ్ పూల్ లో వేయాలి, ఓ హౌస్ మేట్  ను డైనింగ్ టేబుల్ మీద డాన్స్ చేసేలా చేయాలి

బిగ్ బాస్ సీజన్ 2 సోమవారం ఎపిసోడ్ లో కామన్  మ్యాన్ గణేష్ వెక్కి వెక్కి ఏడవడం హాట్ టాపిక్ అయింది. అసలు విషయంలోకి వస్తే.. హౌస్ లో ఉన్నవారిని బిగ్ బాస్ ఎవరితో మీకు మాట్లాడడం ఇష్టం లేదో ఏకాభిప్రాయంతో ఒకరి పేరుని చెప్పాలని అన్నారు. అందరూ చర్చించుకొని అమిత్ పేరు చెప్పారు. ముందుగా గణేష్.. అమిత్ పేరుని సూచించాడు. దీంతో అమిత్ నేరుగా ఎలిమినేషన్ కు నామినేట్ అయినట్లు తెలిపారు.

అయితే ఈ ఎలిమినేషన్ నుండి తప్పించుకోవడానికి బిగ్ బాస్  అమిత్ కు ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో అమిత్ ఒకరి వంట చెడగొట్టాలి, ఓ కంటెస్టెంట్ నెత్తిపై గుడ్డు కొట్టాలి, దీప్తి సునయనను ఏడిపించాలి, ఓ కంటె స్టెంట్ ప్యాంట్, షర్ట్ , షూస్ స్విమ్మింగ్ పూల్ లో వేయాలి, ఓ హౌస్ మేట్  ను డైనింగ్ టేబుల్ మీద డాన్స్ చేసేలా చేయాలి. ఇవన్నీ ఎవరికీ తెలియకుండా చేయాలి. ఇందులో భాగంగా అమిత్.. గణేష్ నెత్తిపై గుడ్డుని పగలగొడుతూ.. నువ్వే కదా ముందు నా పేరు చెప్పావ్.. నా కోపం చూడొద్దు అన్నా కానీ చూశావ్ అంటూ నటిస్తూ వెళ్లిపోయాడు.

అమిత్ ప్రవర్తనతో షాక్ అయిన గణేష్.. దీప్తి సీక్రెట్ టాక్ ఏమో అని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. బాత్రూంలోకి వెళ్లి చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. హౌస్ లో వాళ్లు కూడా టాస్క్ అయితే మాత్రం ఇలా చేయాలా అంటూ అమిత్ మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో గణేష్ మరింత ఏడవడం మొదలుపెట్టాడు. దీంతో అమిత్ ఓ కెమెరా ముందుకు వచ్చి వీళ్లంతా నన్ను అర్ధం చేసుకోవడం లేదని తన ఆవేదన వ్యక్తం చేశాడు. టాస్క్ ఓడిపోయినా పర్వాలేదని గణేష్ దగ్గరకి వెళ్లి హౌస్ మేట్స్ అందరికీ ఉన్న విషయం చెప్పేశాడు. అయినా బిగ్ బాగ్ మాత్రం అమిత్ ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడని ప్రకటించడం విశేషం.  

loader