బిగ్ బాస్2 లో తేజస్వి: మా మధ్య ఎఫైర్ ఉంటే బయట చూసుకుంటాం

bigg boss2: tejaswi on affair with samrat
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకొని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది

బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకొని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఈ షోపై కొందరు పెదవి విరుస్తున్నారు. దీంతో షోని రసవత్తరంగా నడిపించడానికి చేయని ప్రయత్నాలు లేవు. నిన్నటి ఎపిసోడ్ లో అయితే ఎఫైర్ల గొడవను మొదలుపెట్టారు. హౌస్ లో ఉన్న సభ్యులు తేజస్వి-సామ్రాట్ ల మధ్య ఏదో ఎఫైర్ ఉందని కొద్దిరోజులుగా గుసగుసలాడుకుంటున్నారు.

తాజాగా దీప్తి సునయన, తనీష్ ల మధ్య ఎఫైర్ నడుస్తుందని అనుకుంటున్నారు. అర్ధరాత్రి వేల భాను.. యాంకర్ దీప్తి, గీతామాధురి, శ్యామలతో బయటకి అన్న అని పిలుస్తూ తనీష్ తో ఎఫైర్ నడుపుతుందంటూ దీప్తి సునయనను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఒకే బెడ్ మీద తనీష్, దీప్తో పడుకోవడం దుప్పట్లో దూరడం వంటి విషయాల మీద చర్చించుకున్నారు. ఇది చాలదు అన్నట్లు తేజస్వి.. తనకు సామ్రాట్ కు ఏదో ఉందని ప్రచారం చేస్తున్నారని బాబు గోగినేనితో చెప్పుకొని బాధ పడి.. మిగిలిన హౌస్ మెంబర్స్ దగ్గరకు వెళ్లి 'మా మధ్య ఏముంటే మీకేంటి.. ఏమైనా ఉంటే బయటకు వెళ్లి చూసుకుంటాం.. మీకేంటి సమస్య' అంటూ బోల్డ్ గా కామెంట్ చేసింది.

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా తనీష్ చేసిన ఓ నాటకం ఈ ఎఫైర్ల గురించి హౌస్ మొత్తం మాట్లాడుకునేలా చేసింది. హౌస్ లో నియమాలను సరిగ్గా పాటించడం లేదని గీతామధురిని జైలులో పెట్టడంతో పాటు అక్కడి గోడ మీద నియమాలకు విరుద్ధంగా ఏం చేయనని వంద సార్లు రాయాలని శిక్ష వేశారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ లో సామ్రాట్, తనీష్ తప్ప మిగిలిన వారందరూ నామినేట్ కావడం ఆశ్చర్యపరుస్తోంది. 

loader