బిగ్ బాస్2: శివబాలాజీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ..?

bigg boss2: sivabalaji wild card entry
Highlights

బిగ్ బాస్ సీజన్2 పై ఇప్పుడు ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే పెరిగాయి. షో మొదలై ఆరువారాలు పూర్తయ్యాయి. మొదట్లో నాని కనిపించే ఎపిసోడ్స్ తప్ప మిగిలినవి చాలా డల్ గా నడిచేవి

బిగ్ బాస్ సీజన్2 పై ఇప్పుడు ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే పెరిగాయి. షో మొదలై ఆరువారాలు పూర్తయ్యాయి. మొదట్లో నాని కనిపించే ఎపిసోడ్స్ తప్ప మిగిలినవి చాలా డల్ గా నడిచేవి. అయితే గతవారం యాంకర్ ప్రదీప్ షోలోకి రావడంతో ఈ షాపై ప్రేక్షకుల్లో హైప్ బాగా పెరిగింది. ఇప్పుడు ఈ హైప్ ను మరింత పెంచే విధంగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా సీజన్1 విన్నర్ శివబాలాజీని హౌస్ లోకి పంపాలని ప్లాన్ చేస్తున్నారని టాక్.

మొదటి సీజన్ లో అందరిని వెనక్కి నెట్టి ఫైనల్ విన్నర్ గా గెలిచాడు శివ బాలాజీ. ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రైజ్ మనీ కూడా అందుకున్నారు. అయితే బిగ్ బాస్ షో తరువాత శివబాలాజీ మహా అయితే ఒక సినిమాలో మాత్రం కనిపించాడు. ఆ తరువాత బయట పెద్దగా కనిపించలేదు. అయితే ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ ద్వారానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని టాక్. ఆయనను హౌస్ లోకి పంపడం ద్వారాఆహ్లాదకర వాతావరణం ఏర్పడి పోటీ పెరుగుతుందని చిత్రబృందం భావిస్తోంది.

తమిళంలో సీజన్ 1 లో టాప్ కంటెస్టెంట్ గా నిలిచి ఓవియా టైటిల్ గెలవకపోయినా.. మంచి క్రేజ్ తెచ్చుకుంది. అందుకే ఈ సీజన్ లో ఆమెను గెస్ట్ గా పిలిచారు. ఇప్పుడు అదే ఫార్ములాను తెలుగుకి అప్లై చేస్తున్నారని సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది. 

loader