బిగ్ బాస్2: సీన్ రివర్స్ అయ్యేలా ఉందే.. తేజుకి బదులు శ్యామల?

bigg boss2: shyamala reentry in house
Highlights

నిజానికి హౌస్ లో తేజస్వి లాంటి నటులు ఉంటేనే టీఆర్ఫీ రేటింగ్స్ కూడా ఎక్కువగా వస్తాయనే ఆలోచనతో బిగ్ బాస్ తేజస్విని తీసుకొచ్చే స్కెచ్ వేశారని కానీ అది వర్కవుట్ అవ్వదనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి

బిగ్ బాస్ సీజన్ 2 మొదలయ్యి ఆరు వారాలు పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరు వారాల్లో ఎలిమినేట్ అయిన ఆరుగురు కంటెస్టెంట్లలో ఒకరిని తిరిగి హౌస్ లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు. ఇదంతా తేజస్విని హౌస్ లోకి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నమే అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు శ్యామల హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. ఆన్ లైన్ లో నిర్వహించిన పోల్ లో అధిక శాతం ఓట్లు శ్యామలకు దక్కుతున్నాయని తెలుస్తోంది. తేజస్వి హౌస్ లోకి వస్తుందనుకుంటే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేలా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి హౌస్ లో తేజస్వి లాంటి నటులు ఉంటేనే టీఆర్ఫీ రేటింగ్స్ కూడా ఎక్కువగా వస్తాయనే ఆలోచనతో బిగ్ బాస్ తేజస్విని తీసుకొచ్చే స్కెచ్ వేశారని కానీ అది వర్కవుట్ అవ్వదనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

తేజస్వి హేటర్స్, కౌశల్ ఆర్మీ ఆమెను హౌస్ లోకి వెళ్లనివ్వమని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు తేజస్వికి బదులు శ్యామల హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి!

loader