బిగ్ బాస్2: శ్యామల, నూతన్ నాయుడు రీఎంట్రీ

bigg boss2: shyamala, nutan naidu re entry
Highlights

అందరూ తేజస్వి హౌస్ లోకి వెళ్తుందని అనుకున్నారు కానీ నూతన్ నాయుడు, శ్యామల హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ సంపాదించారు. ఈ విషయాన్ని నాని అనౌన్స్ చేశారు. ఎన్నడూ లేని విధంగా ఈ వారంలో 11 కోట్ల మంది ఓట్లు వేసినట్లు నాని వెల్లడించారు

బిగ్ బాస్ సీజన్ 2 'ఏదైనా జరగొచ్చు' అన్నట్లే ఆదివారం ఎపిసోడ్ లో ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చారు. ఈ వారం హౌస్ లోకి ఆల్రెడీ ఎలిమినేట్ అయిన ఆరుగురిలో కంటెస్టెంట్ లలో ఒకరిని తీసుకువెళ్లే ఛాన్స్ ఉందని ప్రకటించారు. గత వారం రోజులుగా ఎవరు హౌస్ లోకి వెళ్లబోతున్నారనే విషయంలో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది.

ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు లు కూడా తమకు ఓట్ చేయాలని ఆన్ లైన్ లో క్యాంపైన్ నిర్వహించారు. అయితే ఈరోజు అనూహ్యంగా హౌస్ లోకి ఎలిమినేట్ అయిన ఆరుగురి కంటెస్టెంట్ లలో ఇద్దరు ఎంట్రీ ఇవ్వనుండడం అందరికీ షాక్ ఇచ్చింది. అందరూ తేజస్వి హౌస్ లోకి వెళ్తుందని అనుకున్నారు కానీ నూతన్ నాయుడు, శ్యామల హౌస్ లోకి 
రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ సంపాదించారు.

ఈ విషయాన్ని నాని అనౌన్స్ చేశారు. ఎన్నడూ లేని విధంగా ఈ వారంలో 11 కోట్ల మంది ఓట్లు వేసినట్లు నాని వెల్లడించారు. శ్యామల, నూతన్ నాయిడు హౌస్ లోకి ఎప్పుడు వెళ్లబోతున్నారనే విషయాన్ని బిగ్ బాస్ డిసైడ్ చేస్తారని అన్నారు. నూతన్ నాయిడు, శ్యామలకు ఓట్ల విషయంలో స్వల్ప తేడానే ఉండడంతో ఇద్దరినీ హౌస్ లోకి పంపుతున్నట్లు సమాచారం. 

loader